Breaking News

అభివృద్ధి, నిర్మాణములను చూపించి వారికి గల సందేహాలను నివృత్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, శనివారం ప్రకాష్ నగర్, ఏ.వి.ఎస్ రెడ్డి రోడ్, ఎల్.బి ఎస్ నగర్ ప్రాంతాలలో గల 268, 269 మరియు 271 సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్బంలో జగనన్న గృహ నిర్మాణములకు సంబందించి సెక్రెటరీలను వారి టార్గెట్ ఎంత, ఎంత మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు, లేని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేయుటకు చేపట్టిన చర్యలు, లబ్దిదారుని వాటా చెల్లించిన వారి వివరములు లే అవుట్లో ఇంటి నిర్మాణం ప్రారంభమైనది లేనిది మొదలగు అంశాలపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు.

ప్రతి లబ్దిదారుడు సంతృప్తి చెందు విధంగా వారిని లే అవుట్ నందు జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణములను చూపించి వారికి గల సందేహాలను నివృత్తి చేయవలసిన ఆవశ్యకత మీ పై ఉందని, ప్రభుత్వం ద్వారా వారికీ కల్పిస్తున్న ప్రయోజనాలను సమగ్రంగా వివరించాలని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాలు సాధించి ప్రతి లబ్దిదారుడు గృహ నిర్మాణము చేపట్టుకొనే విధంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవలెనని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *