Breaking News

దుర్గాగ్రహారం నందు జరిగిన హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది. 06.07.2022వ తేదీ రాత్రి 09.09 గంటలకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ C.I. V. జానకి రామయ్య కి సీతారాంపురం, కొత్త వంతెన రోడ్డు, ఆపిల్ స్టేషనరీ షాప్ ఎదురుగా,హత్య జరిగిందని వచ్చిన సమాచారం మేరకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, పోలీస్ కమీషనర్, ఐ.పి.ఎస్.,  ఆదేశాల మేరకు, డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్., పర్యవేక్షణ లో సౌత్ ఏ.సి.పి డా. బి.రవి కిరణ్, సి.ఐ.జానకి రామయ్య, క్లూస్ టీం మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి Cr.No.183/2022 U/s 302 IPC నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.

దర్యాప్తులో బాగంగా కొత్త వంతెన రోడ్డు, సీతారాంపురం, శ్రీ అపర్ణ క్లినిక్ ఎదురుగా గల ఇంట్లో గడ్డం బాబు @ చందు S/o దాసు, వయస్సు 37 సంవత్సరములు అను అతని స్వగ్రామము నెల్లూరుజిల్లా, కావలి గ్రామము. సెల్ ఫోన్ రిపేర్ మరియు ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి బార్య ఇద్దరు మగపిల్లలు వున్నారు. తన బార్య ఓక ప్రైవేట్ హాస్పటల్ నందు హౌస్ హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నది. తన భార్య పెద్దమ్మ అయినా రత్నాల జ్యోతితో పాటు వాళ్ళ నాన్న మరియు తమ్ముడు రత్నాల తంబి, హాస్పటల్ దగ్గరలోని మేదర బజార్, గీతా మందిరం రోడ్లో నివాసం ఉంటున్నారు. తన స్కూటీ బాగోలేక పోవటం తో పలుమార్లు తంబి తో ఫైనాన్సు లో మంచి బండి ఇప్పించమని అడుగగా ఇద్దరు కలిసి బండి కోసం చాలా రోజులు తిరిగి దొరకలేదని మద్యం సేవించి గొడవ పడినారు. ఈ క్రమంలో హతుడు తన భార్య గురించి తప్పుగా తన స్నేహితులకి ప్రచారం చేసి, తన పరువు, తన కుటుంబం పరువు తీస్తున్నాడని హతుడికి మరియు అతని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు, వారు కుడా హతుడిని మందలించినట్లు, అయిన సరే హతుడు తన పద్ధతి మార్చుకోకుండా గడ్డం బాబు కనపడిన సమయంలో హతుడు తంబి వెకిలిగా నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నాడని మనస్సులో పెట్టుకుని ఏవిధంగానైన తంబిని హత్యచేయలని నిర్ణయించుకున్న సమయంలో ది 06/07/2022 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలో తంబి మందు తాగుతూ ముద్దాయి వంక చూసి వెకిలిగా నవ్వుతూ ఉండటం చూసి ఇంటికి వెళ్ళిపోయి కోపంతో రాత్రి 9 గంటల సమయం లో తన ఇంటిలోని కూరగాయలు కోసే చాకును తన జేబులో పెట్టుకుని హతుని వద్దకు వెళ్లి గొంతులో బలంగా పొడిచి అక్కడ నుండి చాకు తీసుకుని తన యొక్క బండి అయిన AP 37 DJ 4585 నెంబరు గల MASTRO స్కూటీ ని వేసుకుని కొత్త వంతెన వైపు వెళ్ళిపోతూ చాకును కాలవ గట్టు ఒడ్డున పడేసి వెళ్ళిపొయినాడు.
ఈ క్రమంలో నిందితుడు ఈ రోజు ఉదయం తన వద్ద వున్న బండిని తాకట్టుపెట్టి డబ్బులు తీసుకుందామని కృష్ణ లంక వారధి సమీపంలోకి రాగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *