Breaking News

రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమం చిరస్థాయిగా నిలిచిపోయింది…

-పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ వద్ద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
-రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్రానికి ఆరోగ్య దాత – వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ వద్ద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు రాజశేఖరరెడ్డి విగ్రహన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడన్నారు. తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన చరిత్రలో నిలిచిపోయే అభివృద్ది పనులు చేశారన్నారు. విద్య,వైద్య రంగాలకు పెద్దపీట వేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. నేడు పెద్దాయన రాజశేఖరరెడ్డి ఆశయాలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరుణ దేవుడు కూడా మాపై కరుణ చూపించడన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధికి,సంక్షేమ నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుళ్ళ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, కొండపల్లి బుజ్జి, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *