గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నిక ఆగస్ట్ 11న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతుందని, ఈ నెల 25 నుండి అభ్యర్ధులు నానినేషణ్ దాఖలు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు 6 మంది స్టాండింగ్ కమిటి సభ్యుల ఎన్నికకు సంబందించిన నోటీసు జారి చేయడం జరిగిందని, శుక్రవారం ఓటర్ల లిస్ట్ కూడా నగరపాలక సంస్థ మేనేజర్ కార్యాలయంలో అందుబాటులో ఉంచడమైనదని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు తమ నామినేషన్ ఫారాలను ఈ నెల 25 నుండి ఆగస్ట్ 1 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అదనపు కమిషనర్ చాంబర్ లో అందించాలని తెలిపారు. ఆగస్ట్ 1న 3 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేసిన వారి జాబితాను పబ్లిష్ చేస్తామని, ఆగస్ట్ 2న ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు నామినేషన్లను స్క్రూట్నీ చేసి ఆమోదం పొందిన వాటి వివరాలు అదే రోజు జాబితా పబ్లిష్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ల విత్ డ్రా కు ఆగస్ట్ 6న 12 గంటల నుండి 3 గంటల వరకు సమయం ఉంటుందని, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్ధుల ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తామన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటి ఎన్నిక ఆగస్ట్ 11న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని, అదే రోజు 3 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్ధుల ప్రకటన జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News