Breaking News

నగరంలో ప్రతి భవనం మరియు నిర్మాణం ఆస్తి పన్ను కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రతి భవనం మరియు నిర్మాణం ఆస్తి పన్ను కల్గి ఉండాలని, కావున అడ్మిన్ కార్యదర్శులు అండర్ అసెస్మెంట్లు, అన్ అసెస్మెంట్లను గుర్తించి వారం రోజుల్లో పన్ను విధింపు ప్రక్రియను పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ సచివాలయ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో మరియు జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ తమ క్షేత్ర స్థాయి పర్యటనలో ఆస్తి పన్ను లేని భవనాలను గుర్తించామని, ఇక పై ఉపేక్షించేది లేదని, రానున్న వారం రోజుల్లో నగరంలోని ప్రతి నిర్మాణంకు ఆస్తి పన్ను విధిగా ఉండాలన్నారు. అందుకు ప్రత్యేక డ్రైవ్ మోడ్ లో అండర్ అండ్ అనెసేస్మెంట్ లను గుర్తించి, ఆస్తి పన్ను విధించాలని ఆదేశించారు. అడ్మిన్ కార్యదర్శులు సచివాలయ పర్యవేక్షణ అధికారిగా భాధ్యత వహించాలని, సచివాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వాలంటీర్లు వారంలో 3 రోజులు విధులకు హాజరు కావాలని, వారి హాజరుని ఆన్ లైన్ ద్వారా తీసుకోవాలన్నారు. విధులకు సక్రమంగా హాజరు కాని వాలంటీర్ల వివరాలు పంపితే వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన లోపాలపై 173 అడ్మిన్ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారి చేయాలని డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. అడ్మిన్ మరియు ఎమినిటి కార్యదర్శులతో కలిసి డోర్ టు డోర్ సర్వే చేసి, కుళాయిలు ఉన్న, లేని గృహాల వివరాలు, కుళాయిలు ఉండి నీటి పన్ను లేని గృహాల వివరాలు, అదేవిధంగా సచివాలయ పరిధిలోని అపార్ట్మెంట్లు మరియు కమర్షియల్ కాంప్లెక్స్ లు బైలాస్ ప్రకారం మీటర్ కుళాయిలు ఉన్నది లేనిదీ పరిశీలించి వారంలోపు నివేదిక ఇవ్వాలన్నారు. అడ్మిన్, ఎమినిటి మరియు శానిటేషన్ కార్యదర్శులు సంయుక్తంగా సచివాలయం పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేని షాప్స్ ని గుర్తించడమే కాకుండా 15 రోజుల్లో డిమాండ్ జనరేట్ చేయాలని, స్పందించని వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసే రెవెన్యూ సేవల అర్జీలు విధిగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, ప్రతి సోమవారం జరిగే స్పందనలో ఆర్జీల పరిష్కారం పై సమీక్ష ఉంటుందని, నిర్లక్ష్యం కనపరిచిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్మిన్ కార్యదర్శులు రెవెన్యూ ఇన్సెపెక్టర్ల తో కలిసి నగరపాలక సంస్థ కమర్షియల్ కాంప్లెక్స్ లలోని షాప్స్, బకాయిలు, వసూళ్ల పూర్తీ వివరాలను సిద్దం చేయాలని, బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. డి.ఎం.ఏ. కార్యాలయం వారు సచివాలయం పరిధిలోని అసెస్మెంట్లను మ్యాపింగ్ చేయుటకు ప్రత్యేక స్క్రీన్ విడుదల చేయన్నున్నారని, దీనిపై అడ్మిన్లు, ఆర్.ఐ.లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దీర్ఘకాలికంగా వివిధ కారణాలతో పన్ను చెల్లించుటకు వీలులేని (అన్ కలెక్ట్ బుల్ డిమాండ్) అసెస్మెంట్ లను నెల రోజుల్లో గుర్తించి, ప్రణాళిక పద్దతిలో తొలగించడానికి నివేదిక ఇవ్వాలన్నారు. రెవెన్యూ విభాగం కోర్ట్ కేసుల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, న్యాయ సలహా మేరకు నిర్ణీత ఉత్తర్వులు లేని వాటి నుండి పన్ను వసూళ్ళకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇంచార్జి అదనపు కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఆర్.ఓ.లు యస్.యన్.ప్రసాద్, డి.వేణుబాబు, బాలాజీ బాష, రవి కుమార్, సూపరిండెంట్ రవికిరణ్ రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *