Breaking News

పర్యావరణ ప్రాజెక్ట్ ల ప్రణాళిక వర్క్ షాప్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చేపట్టే రోడ్లు, నూతన ప్రాజెక్ట్ ల నిర్వహణా వ్యయం తగ్గించుకొని, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవడానికి నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, అకౌంట్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు పర్యావరణ ప్రాజెక్ట్ ల ప్రణాళిక వర్క్ షాప్ రెండో రోజైన శుక్రవారం కూడా కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్  సూచించిన విధంగా వర్క్ షాప్ లో యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృంద సభ్యులు ప్రాజెక్ట్ ల స్థితి, స్థాపన, వ్యయ ప్రభావం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి వివిధ ప్రమాణాల పై అధికారులకు అవగాహన కల్గించారు. ప్రాజెక్ట్లలో ప్రమాదాల నివారణకు ఇంజినీర్లకు దిశా నిర్దేశం చేశారు. పర్యావరణ ప్రాజెక్ట్ ల కోసం పెట్టుబడులకు మూలధన బడ్జెట్ మరియు ఫైనాన్సింగ్ గురించి వర్క్ షాప్ లో సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ జానీస్ విట్టింగ్ టన్, క్యాలిఫ్లోర్నియా స్టేట్ పాల్ట్కినిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆడ్రీన్ గ్రీవ్, సుజాత శ్రీకుమార్, యునిడో ప్రాజెక్ట్ బృందం నుండి డాక్టర్ నందపాల్ సింగ్, మానస సురేష్, పి.వి.రమణారావు, నగరపాలక సంస్థ ఎస్.ఈ. డి.శ్రీనివాస్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్ర కుమార్, నాగ శ్రీనివాస్, ఈ.ఈ.లు, డి.ఈ.ఈ.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *