Breaking News

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో గురువారం నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్  శానిటేషన్ మరియు ఇంజినీరింగ్ అధికారులను శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో రెండు రోజులు వర్షాలు ఉండ వచ్చని, నగర ప్రజలకు అసౌకర్యం కల్గకుండా రోడ్ల మీద నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని, కాల్వల్లో ఎక్కడా నీరు నిల్వకుండ ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. రోడ్ల పై పడిపోయిన చెట్లను లేదా కొమ్మలను వెంటనే తొలగించడానికి సిబ్బంది మరియు కట్టర్ లను అందుబాటులో ఉంచుకోవాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లను కూడా సిద్దంగా ఉంచాలని ఎస్.ఈ.ని, పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా చూడాలని సి.ఎం.ఓ.హెచ్.ని, మురుగునీటి పారుదలకు ఆటంకంగా ఉన్న డ్రైన్ల ఆక్రమణలను వెంటనే తొలగించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *