-రాష్ట్ర అధ్యక్షుడు పిండి శ్యాంబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పిండి శ్యాంబాబు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ పథకంలో భాగంగా ఎం.డి. యు వ్యవస్థ వచ్చిందని ఈ పథకం వలన ఎంతో మంది మహిళలు, వృద్ధులు ఇంటి వద్దకే రేషన్ సరుకులు వస్తున్నందుకు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని, అలాగే వృద్ధులు ఇళ్లలోనే వేలిముద్ర వేసి రేషన్ సరుకులు తీసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో డిపో కి వెళ్లి క్యూ పద్ధతి పాటించి గంటలకొద్ది నిలబడి ఆ బరువును మోసుకొని చాలా ఇబ్బంది పడే వారిని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎం.డి.యు ఆపరేటర్స్ వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఏమి అన్యాయం చేయలేదని, కమిషన్ ఒక్క రూపాయి తగ్గకుండా ఇస్తున్నారని , గోని సంచులు రిటన్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా 50 శాతం నుంచి 60 శాతం మాత్రమే సరుకులు పంపిణీ జరిగేదని , ప్రస్తుతం 90 నుంచి 95 శాతం పంపిణీ జరుగుతుందని అన్నారు. రేషన్ డీలర్లు మా వ్యవస్థనే తీసివేయాలని కొంతమంది రాజకీయ పరమైన వ్యక్తులతో కలిసి, రేషన్ డీలర్లు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను మేము ఖండిస్తున్నామని అన్నారు. రేషన్ డీలర్ల ఇప్పటికైనా తప్పుని గుర్తించి జగనన్న ప్రభుత్వం తో కలిసి రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎం.డి.యు యూనియన్ కమిటీ డిమాండ్ చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎం.డి.యు ప్రెసిడెంట్ పి.అరుణ్ కుమార్ , ట్రెజరర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News