-ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగురాలికి వీల్ ఛైర్ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు.. దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యేని వీల్ ఛైర్ కోసం మహబూబ్ బి అనే మహిళ విన్నవించమైనది. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు చేయించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో వీలై చైర్ ను మహిళ కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోరకాల పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగుల సాధికారతకు అవసరమైన శారీరక, వైద్య, ఆర్థిక తదితర అంశాల్లో పూర్తి తోడ్పాటును అందిస్తోందన్నారు. సమాజంలో వారిపై ఉన్న వైఖరి, అవరోధాలను తొలగించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్ ను రూ.3 వేలకు పెంచినట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2,423 మంది దివ్యాంగులకు క్రమం తప్పకుండా ప్రతినెలా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క పింఛన్ రూపంలోనే సాయం కాకుండా దివ్యాంగులకు కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తూ.. ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్లు తెలిపారు. కనుక అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మోదుగుల గణేష్, లబ్ధిదారుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.