Breaking News

సొంత ప్రాంత ప్రజలకు సేవలందించడం అభినందనీయం


-గోదావరి జిల్లాల ‘శ్రీమంతుడు’ డాక్టర్ కె. సంజీవరావు
-వ్యాస్క్యులర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
-డాక్టర్ సంజీవరావు నేతృత్వంలో కేర్ వెల్ హాస్పిటల్లో ఉచితంగా వ్యాస్క్యులర్ సర్జరీ సేవలు
-వైద్య పరీక్షలపై 50% రాయితీ, తగ్గింపు ధరలకు మందులు
-దివంగత డాక్టర్ చిరంజీవి స్ఫూర్తితో గోదావరి జిల్లాల ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొంత ప్రాంతాన్ని విస్మరించకుండా పేద ప్రజలకు సేవలందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వ్యాస్క్యులర్ డే సందర్భంగా ప్రఖ్యాత వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కె. సంజీవరావు ఆధ్వర్యంలో స్థానిక జి హోటల్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. వాస్క్యులర్ మంత్ సందర్భంగా నగరంలోని కేర్ వెల్ హాస్పిటల్లో రక్తనాళాల సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఉచిత సర్జరీ సేవలు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వాస్క్యులర్ సర్జన్ గా విశేష ఖ్యాతి గడించిన డాక్టర్ కె. సంజీవరావు సొంత ప్రాంత ప్రజల కోసం ఉచిత సర్జరీ సేవలను అందుబాటులోకి తేవడం హర్షణీయమని అన్నారు. సొంతగడ్డను విస్మరించకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్ సంజీవరావు, గోదావరి జిల్లాల ప్రజలకు నిజమైన శ్రీమంతుడని కొనియాడారు. ప్రజల ఆహారపుఅలవాట్లు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో పాటు, పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రజలు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల బారినపడుతున్నారని విశ్లేషించారు. రక్తనాళాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలకు చికిత్సలందించడంలో నిష్ణాతులైన డాక్టర్ సంజీవరావు అందిస్తున్న ఉచిత సర్జరీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. దాదాపు అన్ని వ్యాధులకు సంబంధించిన చికిత్సలను తమ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయమందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. నగర మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజల కోసం, మరీ ముఖ్యంగా కాకినాడ నగరవాసులకు అందుబాటులో ఉండేలా ఉచిత వ్యాస్క్యులర్ సర్జరీలను అందించడం ముదావహమని అన్నారు. డాక్టర్ సంజీవరావు అందిస్తున్న ఉచిత వైద్య చికిత్సలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ శివప్రసన్న కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ రక్తనాళాలకు సంబంధించిన రుగ్మతలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఆధునిక జీవన విధానం, మధుమేహం వంటి కారణాలతో పాటు, ధూమపానం వంటి దురలవాట్లతో రక్తనాళాల్లో సమస్యలు ఏర్పడవచ్చని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా రక్తనాళాలకు సంబంధించిన వివిధ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. వ్యాస్క్యులర్ మంత్ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కేర్ వెల్ హాస్పిటల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రక్తనాళాల సమస్యల గురించి, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 50 మంది పేషెంట్లకు వ్యాస్క్యులర్ సర్జరీలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వెరికోస్ వెయిన్స్ సమస్యకు యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్, బైపాస్ వంటి ఆధునిక పద్ధతుల్లో చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎల్టీ, ఏవీ ఫిస్టులా, ధమనులకు సంబంధించిన వ్యాధులు, రక్తనాళాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, డాప్లర్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలపై 50 శాతం రాయితీతో పాటు, తక్కువ ధరలకు మందులను అందిస్తున్నట్లు వివరించారు. దివంగత డాక్టర్ చిరంజీవి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, గోదావరి జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య చికిత్సలను అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు డాక్టర్ కె. సంజీవరావు పేర్కొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉచిత వైద్య చికిత్సల కోసం 9885771555, 9989870010 హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *