గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, స్పందన అర్జీలు రీ ఓపెన్ అయితే సంబందిత సిబ్బంది పై చర్యలు తప్పవని విభాగాదిపతులకు నగర నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. సచివాలయాల్లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరగాలాని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సచివాలయాలలో అర్జీలు అందించాలని, అందిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే స్పందనలో వచ్చే అర్జీలను సమగ్ర సమాచారం, మరియు పరిష్కారాలతో నిర్షేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను విభాగాధిపతులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 24 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 6, ఇంజినీరింగ్ విభాగం 6, ప్రజారోగ్య విభాగం 8, రెవెన్యూ విభాగం 1, ఉపా సెల్ 3 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, యస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News