-స్థానిక సమస్యలపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా 98499 08391 వాట్స్ అప్ నంబర్
-సత్వర పరిష్కారానికి చక్కని మార్గం
-నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ ఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సమస్యల పరిష్కారం ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఒక్క క్లిక్ ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందుకు ప్రత్యేకంగా వాట్స్ అప్ నంబర్ ని 98499 08391 నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రజలు చుట్టుపక్కల తాము ఎదుర్కుంటున్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్యం, డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్ లీకులు, యు.జి.డి. లైన్ల ఓవర్ ఫ్లో, వీధి దీపాలు, అనధికార కట్టడాలు వంటి సమస్యల పై వెంటనే ఫొటో తీసి వివరాలు పంపవచ్చని తెలిపారు. సదరు సమస్యను కాల్ సెంటర్ సిబ్బంది వెంటనే సంబందిత అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కావున నగర ప్రజలు స్థానిక సమస్యల పై నగరపాలక సంస్థ వాట్స్ అప్ నంబర్ కి ఫిర్యాదు చేసి తేలికగా పరిష్కారం పొందవచ్చన్నారు.
Prajavartha Online Telugu News