Breaking News

పోలింగ్ బూత్ ల మార్పును రాజకీయ పార్టీలు గుర్తించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పోలింగ్ బూత్ ల మార్పును రాజకీయ పార్టీలు గుర్తించాలని గుంటూరు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు (ఏ.ఈ.ఆర్.ఓ.) వెంకట కృష్ణయ్య, మూర్తి గార్లు కోరారు. నగర కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.)  కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల మార్పు ప్రతిపాదనల పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఏ.ఈ.ఆర్.ఓ.లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఈ.ఆర్.ఓ.లు మాట్లాడుతూ బ్రాడిపేటలోని శారదా నికేతన్ శిదిలావస్థ కారణంగా కొన్ని భవనాలను తొలగించారని, అందులో ఇప్పటి వరకు ఉన్న 135, 136 పోలింగ్ బూత్ లను, శారద నికేతన్ ఎదురు ఉన్న శారదా నికేతన్ ఓరియంటల్ పబ్లిక్ స్కూల్ ల్లోకి మార్చడమైనదన్నారు. సదరు మార్పుని రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించాలని, మార్పులను ఆమోదం కోసం ఎన్నికల సంఘంకు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *