Breaking News

గుంటూరు నగరంలో స్వంత ఇళ్లు లేని పేదలకు సువర్ణవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో స్వంత ఇళ్లు లేని పేదలకు సువర్ణవకాశం, ప్రభుత్వ నిబందనల ప్రకారం ఏక మొత్తం చెల్లించి టిడ్కో ఇళ్ళను పొందవచ్చని నగర నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అడవితక్కేల్లపాడు, వెంగలయపాలెంలో నిర్మించిన జి+3 భవన నిర్మాణాల్లోని డబల్ బెడ్ రూమ్ గృహాల్లో షుమారు 8 వందలు మందివి సాంకేతిక కారణాల వలన రద్దు చేయబడి, ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సదరు గృహ సముదాయాలకు ప్రభుత్వం 40 అడుగుల రోడ్లు, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పార్క్లు, పాఠశాలలు, వైద్య సదుపాయాలతో, గ్రేటెడ్ కమ్యునిటి తరహాలో సువిశాల వాతావరణంలో మౌలిక వసతులతో సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. కావున నగరంలోని ఇళ్లు లేని పేదల్లో గుంటూరు చిరునామాతో ఆధార్ కార్డ్ కల్గి, ఆసక్తి కల్గిన వారు ఏక కాలంలో 365 అడుగుల చదరపు ప్లాట్ కు రూ.3.40 లక్షలు, 430 అడుగుల ప్లాట్ రూ.4.15 లక్షలను కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ పేరున డి.డి.ని మరియు లబ్దిదారుల తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్ కాపీలను నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అందించ వచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *