Breaking News

గుంటూరు శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సరస్వతి శ్రీచక్రాలయంలో దిగ్విజయంగా దసరా మహోత్సవాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశంలోనే తొలిసారిగా ఇరవై మూడు కోట్ల శ్రీవిద్య బీజాక్షరములకు నిక్షిప్తం చేయబడి గుంటూరు నల్లపాడు రోడ్డు సాయినగర్ మూడోలైన్లో 206 అడుగులు ఎత్తులో నిర్మితమైన స్థూపంపై రెండు అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన శ్రీమహాగణపతి శ్రీకుమారస్వామి సహిత శ్రీ చౌడేశ్వరీ చంద్రశేఖర సరస్వతి త్రిచక్ర ఆలయంలో గత ఎనిమిది రోజులుగా దసరా మహోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం నిత్య అర్చన తిశక్తి ఖడ్గమాల పారాయణం ఉభయదాతల ఆధ్వర్యంలో హోమం సాధారణ భక్తులచే అర్చన సాయంత్రం నిత్యార్చన సామూహిక కుంకుమార్చన చివరిగా మంత్రపుష్పం నీరాజనం తీర్ధప్రసాదములు జరుగుతున్నాయి. కారంచెడు శ్రీ వశిష్ట హరేరామ జపయజ్ఞం ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ ప్రణవానంద గిరి స్వామి శుభాశీస్సులతో ఆలయ సర్వాధికారి శ్రీ శ్రీ శ్రీ విశ్వంభరా నందగిరి స్వామి అందజేయటం తోపాటు నిత్యం ఉపన్యాసాలిస్తున్నారు.సోమవారం అమ్మవారు శ్రీ కనకదుర్గ దేవిగా దర్శనమిచ్చారు స్థానిక శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ శ్రీమతి నాగవెంకట పూర్ణిమ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త నరసింహారావు ఆలయ అర్చకులు కుమార్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్’ టెలికాం సలహా మండలి సభ్యులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *