Breaking News

పాలగిరి చంద్రకళకు అలయ్ బిలయ్ ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళకు “అలయ్. బలయ్”కార్యక్రమానికి రావాలని కోరుతూ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమం “అలయ్. బలయ్”. ఈ కార్యక్రమం ఈనెల 6 తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులలో భాగంగా ఆయనే స్వయంగా ఫోన్ చేసి ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించినందుకు గవర్నర్ బండారు దత్తాత్రేయకు యావత్ భట్రాజుల తరపున ఒక ప్రకటనలో చంద్రకళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *