Breaking News

మౌళిక సౌకర్యాల పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన జగనన్న నగర్ ( టిడ్కో ) గృహ సముదాయాలలో మౌళిక సౌకర్యాల పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవితక్కెళ్ళపాడు లోని జగనన్న నగర్ గృహ సముదాయాలలో జరుగుతున్న మౌళిక సౌకర్యాల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై టిడ్కో నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖాధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న నగర్ వసతి గృహ సముదాయాలలో డ్రైన్లు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, ఇతర మౌళిక సదుపాయాల పనులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, డిసెంబర్ నాటికి లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫేజ్ – I క్రింద 300 చదరపు అడుగుల కేటగిరీలో 2256, 365 చదరపు అడుగుల కేటగిరీలో 1328 మంది, 430 చదరపు అడుగుల కేటగిరీ లో 608 మంది మొత్తం 4192 మంది లబ్దిదారులకు రూ. 243.79 కోట్ల ఖర్చుతో ఫ్లాట్స్ అందివ్వడం జరుగుతుందన్నారు. జగనన్న నగర్ లో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని, ఫిల్టర్, పైప్ లైన్లను పరిశీలించారు. అనంతరం గోరంట్లలో కొండపై ఎనిమిది గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న రెండు వాటర్ ట్యాంక్ లను పరిశీలించారు. అడవితక్కెళ్ళపాడు వాటర్ ట్యాంక్ కు నీటిని సరఫరా చేసే వాటర్ పైపు లైన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన అదనపు నిధుల కొరకు ప్రతిపాదనలు పంపాలని టిడ్కో అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఏ.పి టిడ్కో ఎస్.ఈ ఎం.సిహెచ్.కోటేశ్వరరావు, ఈ.ఈ ప్రసాద రావు, డిప్యూటీ ఈ.ఈ మధు, ఏ.ఇ ఆర్. వేణుగోపాల్, సిఎల్టీసీ సుధాకర్, ఎస్ పిపి ప్రదీప్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస రావు, ఎస్.ఈ వీర భాస్కర్, ఈ.ఈ శాంతి రాజు, డిప్యూటీ ఈ.ఈ అనీఫ్, ఏ.ఇ రాము, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ శ్యామ్, విడ్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, ఏ.ఇ కే.వి. సుబ్బారావు డి.ఇ.ఇ. డి.రాజ మోహన్ రావు, ఏ.డి.ఇ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *