Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్త…!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

అవును ఇది ముమ్మాటిటికీ నిజం. మనం పనిచేసే ఛానల్ కవరేజ్ కోసం వాడుతున్న లోగో లు కరోనా ను మోసుకొస్తాయి అని చెప్పడంలో సందేహామే లేదు. ఇది యదార్థం కూడా. కానీ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్ కు, మాట్లాడే వారికి ప్రమాదమే. ఎందుకో చూద్దాం. వివిధ చానళ్లు లోగోలు ప్రతి రిపోర్టర్ కు ఇస్తారు. మేజర్ సెంటర్ లలో ప్రతి రోజూ 10 స్పాట్ లు,రెండు లైవ్ లు ఉంటాయి. నియోజకవర్గ పరిధిలో స్పాట్ నిత్యం వుండే అవకాశం ఉంది.ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎక్కువ స్పాట్ కవరేజ్ లు ఉంటాయి. ఈ కవరేజ్ వాయిస్, బైట్, లైవ్ కోసం లోగో మైక్ ను ఉపయోగిస్తున్నారు. ఆలోగో మైక్ బైట్ కోసం ఇతరుల ముందు పెట్టినప్పుడు వారు మాట్లాడేప్పుడు తుంపర్లు లోగోలోకి వెళ్లి పోతాయి, అదే మైక్ ను మరొకరి దగ్గరో, లేక జర్నలిస్ట్ లైవ్ కానీ ఎండ్ వాయిస్ ఓవర్ పిటూసి చెప్పాల్సి వచ్చినప్పుడు అవి జర్నలిస్ట్ శరీరంలోకి మహమ్మారి కణాలు చేరి కరోనా సోకే అవకాశం ఎక్కువగా వుంది. మైక్ ను మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రొటెక్షన్ మార్గాలు లేవు. ఒకవేళ నిత్యం శానిటైజ్ చేస్తే మైక్ లోకి శాని టైజ్ వెళ్లి పాడైపోతాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో జర్నలిస్ట్ నిత్యం పోరాటం చేయాల్సి ఉంది.కరోనా ఎవ్వరికి ఉందొ లేదో మనకు తెలియదు. సీఈఓ, ఎడిటర్ వాయిస్ కావాలంటేనో, లైవ్ కావాలంటే మనం ఉరుకులు, పరుగులతో పరిగెత్తుతాము. మనం ఇవ్వన్నీ ఆలోచించే టైం ఉండదు.పోనీ మేజర్ సంఘటనలు జరిగినప్పుడు ఇంతే ఆ సంఘటన కవర్ చేసే విషయం ఆలోచిస్తాము గాని లోగో మైక్ మీద అంత శ్రద్ధ పెట్టె టైం ఉండదు. ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా వవ్యహరించండి లేదా విలువైన మన జీవితాలు నష్టపోవాల్సి వస్తుంది.

Check Also

“రాజమహేంద్రవరం – అనకాపల్లి; రాయచోటి – కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్” – ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *