Breaking News

ముఖ్యమంత్రి పర్యటన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11న గుంటూరు నగరంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా స్థలి, పర్యటన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనరు శ్రీమతి కీర్తి చేకూరి, ఐఏఎస్ గారు ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. మంగళవారం కమిషనరు గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు పారిశుధ్య పనులు, విజ్ఞాన మందిరంలో జరుగుతున్న సభావేదిక పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ నెల 11 వ తేది మైనారిటీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొనున్నారని, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి విజ్ఞాన మందిరం వరకు రోడ్లకు ఇరువైపులా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు ఇప్పటికే ప్రత్యేకంగా శానిటరీ ఇన్సెపెక్టర్లకు విధులు కేటాయించామని, అందుకు తగిన విధంగా పనులు జరిగేలా ఇన్సెపెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. విజ్ఞాన మందిరం ఆడిటోరియంలో లైటింగ్, పెయింటింగ్ పనులు వేగంగా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చూడాలని, చుట్టుపక్కల అనధికార హోర్డింగ్స్, బోర్డ్లు తొలగించాలని పట్టణ ప్రణాలిక అధికారులను, రోడ్ల మధ్యలో మొక్కల ట్రిమ్మింగ్ చేయాలని ఏడి.హెచ్.ని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఈ.ఈ. కోటేశ్వరరావు, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి. కాలేష, రెడ్ క్రాస్ జిలా వైస్ చైర్మన్ రామచంద్ర రాజు, ఏ.డి.హెచ్. రామారావు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *