విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రాఫ్ట్ కౌన్సిల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వారి వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 9, 10 తెదీలలో ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో సీసీఏపీ ఆధ్వర్యంలో ‘వసంతం’ అనే పేరుతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్ర దేశ్ (సీసీఏపీ) కార్యదర్శి ఎస్. రంజన మాట్లాడుతూ ఈ వార్షికోత్స వము క్రాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ వారు ప్రజలకు నచ్చే అనేక కళాకృతులని ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. చేతివృత్తుల వారికి అనేక సమస్యలు వచ్చిన తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుని చేనేత రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారని.. కొనియాడారు. అనేక మైన కళాఖండా లను ప్రజల ముందుకు తీసుకు రావడాన్ని వారు చాలా శ్రమ పడుతున్నారని , కనుక వాళ్ళని ప్రోత్సహించాలని కోరారు . ఈ క్రాఫ్ట్ ఎక్సిబిషన్ వలన వినియోగదారులకు దీనిపై అవగాహన పెరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, అల్లికలు, హస్త కార్మికులు తాము తయారు చేసిన ఉత్పత్తులను 67 స్టాల్స్ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేయీలని కోరారు. ముఖ్యఅతిథిగా చేనేత ముఖ్య కార్యదర్శి సునీత హాజరై బుధవారం ప్రదర్శనను ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో క్రాప్ట్ కౌన్సిల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డి.శైలజ, వైస్ చైర్పర్సన్ ఎస్. ప్రమీలా, బి. సుజాత, జి.రష్మీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News