Breaking News

ఎక్సెల్లా అధినేతకు అరవింద కు ఐసీఈఎఫ్ ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత విద్యను అభ్యసించడానికి సలహాలు సూచనలతో పాటు విద్యార్థులకు వివిధ విషయాలలో ట్రైనింగ్ నిర్వహిస్తూ 15 సంవత్సరాలుగా అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగంలో ఎక్సెళ్ళ ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత అసరవిల్లి అరవింద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల జర్మనీ లోని బెర్లిన్ నగరంలో నిర్వహించబడిన (ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్) సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడి సమావేశాలకు హాజరై యూరప్ దేశాలైన జర్మనీలోగల బెర్లిన్ లో ఇంజినీరింగ్, ఎమ్ఐఏ కోర్సులు, పారిస్ లో ఎం బి ఏ మరియు స్విజర్లాండ్ లో హెూటల్ మానేజ్మెంట్ కోర్స్ ల గురించి అక్కడి టాప్ యూనివర్సిటీలు మరియు వివిధ ఇతర అంతర్జాతీయ అగ్రగామి విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వారి విద్యా కోర్స్ ల గురించి విద్యా, కెరీర్ పరంగా కలిగే ప్రయోజనాల గురించి చర్చించారు. ఇక పై యూరప్ దేశాలలో వృత్తి, విద్యా కోర్సులు చదవాలి అనుకొనే విద్యార్థులకు ఎక్సెల్లా గ్రూప్ ద్వారా ట్రైనింగ్, వివిధ సూచనలు ఇచ్చేందుకు మరింత మెరుగైన అవకాశాలను అందించేందుకు కృషిచేస్తానని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *