గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ గన్నవరం ఎన్నికలలో వి సాంబశివరావు, వి వంశీ మోహన్ కృష్ణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారని ఎన్నికల అధికారి యం రాజుబాబు తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీవోస్ హోమ్ నందు సోమవారంనాడు గన్నవరం ఎన్జీవోస్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి యం రాజుబాబు మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల నుండి మద్యాహ్నం 12.30 వరకు నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. పదకుండు పదవులకు గాని, పదకుండు నామినేషన్లు రావడంతో వి సాంబశివరావు, వి వంశీ మోహన్ కృష్ణ ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యం రాజుబాబు తెలిపారు. అధ్యక్షుడుగా వి సాంబశివరావు(వైద్య ఆరోగ్యశాఖ), కార్యదర్శిగా వి వంశీ మోహన్ కృష్ణ (పంచాయతీరాజ్ శాఖ) కోశాధికారిగా ఎం రవి( ఖజానా శాఖ), సహధ్యక్షుడిగా టివి నాంచారయ్య (పంచాయతీరాజ్ శాఖ), ఉపాధ్యక్షులుగా పి సురేందర్ (వైద్య ఆరోగ్యశాఖ) ఎ సునీల్ కుమార్(రెవిన్యూ శాఖ) ఎస్ శ్రీనివాస్( పశుసంవర్ధక శాఖ) సంయుక్త కార్యదర్శులుగా సి.వి.ఎల్.ఎస్.ఆర్.వి ప్రసాద్ (పంచాయతీరాజ్ శాఖ) జి చంద్రశేఖర రావు (వైద్య ఆరోగ్యశాఖ) ఎ సాల్మన్ రాజు (బీసీ వెల్ఫేర్ శాఖ) మహిళ సంయుక్త కార్యదర్శిగా కె సూర్యకళ (రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి యం డి ఇక్బాల్ అభినందనలు తెలిపారు. గన్నవరం ఎన్జీవోస్ ఎన్నికలలో సహాయ ఎన్నికల అధికారిగా యూవీ పురుషోత్తంరాజు, ఎన్నికల పరిశీలికలుగా విశ్వనాధ్ వ్యవహరించారు. వీరితో జిల్లా ఉపాధ్యక్షుడు జి రామకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సాంబశివరావు వంశీ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 27న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులందరూ రావాలని కోరారు.
Prajavartha Online Telugu News