రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 29, 30 డిసెంబరు 1 తేదీ రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో 3 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ 29, 30 డిసెంబరు 1 తేదీ రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో 3 రోజులపాటు నిర్వహించే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విజయ శంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ మండా కృష్ణమోహన్, అధ్యాపక అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News