విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలకు స్థానికంగానే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరిస్తున్న వినతులకు గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతులకు స్థానికంగానే పరిష్కరింప చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అర్జీదారుడు ఎన్నో వ్యయప్రయాసలతో కలెక్టరేట్‌కు రావడం, తమ సమస్యలను విన్నవించుకోవడం జరుగుతుందన్నారు.సమస్యలకు పరిష్కారం చూపినట్లయితే జిల్లా కేంద్రానికి మరోక సారి రాకుండా ఉంటుందన్నారు. సమస్యలను గ్రామ మండల స్థాయిలో అక్కడిక్కడే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంపలగూడెం కంచికచర్ల, పెనుగంచిప్రోలు మండలాలలో భూ తగదాలపై వచ్చిన అర్జీలను అక్కడిక్కడేపరిష్కరించే విధంగా యంపిడివోలకు తహాశీల్థార్లతో కలెక్టర్ వర్చువల్‌గా మాట్లాడి తగు సూచనలు చేశారు. అదే సమయంలో దీర్ఘకాలికంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలకు సంబంధించి సరైన సమాచారం ఉండాలని అర్జీదారులకు సూచనలు చేస్తూ సరైన సమాచారం లేని అర్జీల విషయంలో అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని కొందరి అర్జీదారులకు కలెక్టర్ సూచించారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నామన్నారు. రీ ఒపెన్ అవుతున్న అర్జీలకు సంబంధించి ప్రతీ శనివారం సంబంధిత అర్జీదారులు, అధికారులతో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఏ స్థాయిలోను అర్జీలు పెండిరగ్ లేకుండా పరిష్కారం చూపుతున్నామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
నేటి స్పందనలో 102 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 42 అర్జీలు నమోదు కాగా, పోలీస్ 15, యంఎయుడి 12, పంచాయతీరాజ్ 5, పౌర సరఫరాల శాఖ 4, వైద్య ఆరోగ్య 4, వ్యవసాయం 3, విద్య 3, సర్వే అండ్ సెటిల్ మెంట్ 2, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2, ఎంప్లాయిమెంట్ 2, హౌసింగ్2, రిజిస్ట్రెషన్ అండ్ స్టాంప్స్ 1, కార్మిక శాఖ 1, డిఆర్‌డిఏ 1, జలవనరుల శాఖ 1, సాంఫీుక సంక్షేమ1, బ్యాకింగ్ రుణాలకు సంబంధించి 1, అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో పరిష్కారమయ్యే వినతులను వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ డిల్లీరావు అక్కడికక్కడే పరిష్కరించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డిఎస్‌వో పి. కోమలిపద్మ, డిసివో సిహెచ్ శైలజ, డిఆర్‌డిఏ పీిడి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడి శ్రీదేవి, మార్కెటింగ్ డిడి దివాకర్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం విజయభారతి, డియంహెచ్‌వో డా.యం సుహాసిని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News