విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిప్యూటి కలెక్టరగా నియమితులైన అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి జాయినింగ్ రిపోర్టును అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనపరుస్తూ దేశ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడిరపజేస్తున్న అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు క్రీడాకారుల కోటాలో డిప్యూటి కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె జిల్లా కలెక్టర్ డిల్లీరావుకు జాయింగ్ రిపోర్టు అందజేశారు. ఈ సందర్భంగా జ్వోతి సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. డిప్యూటి కలెక్టరగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జ్వోతి సురేఖతో పాటు కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, వెన్నం సురేంద్ర తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News