Breaking News

జిల్లాలో బైజుస్ ట్యాబ్ ల పంపిణీ పూర్తి చేసి, వాడే విధానం పై అవగాహన అవసరం…

-అనీమియా నివారణకు పటిష్టంగా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని , 8 వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న బైజుస్ ట్యాబ్ ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం సాయంత్రం అన్నిజిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వర్చువల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదరు సమీర్ శర్మ లు సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, జే సి డి.కే బాలాజీ, అధికారులు హాజరయ్యారు.

వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి ఆదేశాల మేరకు మాతా శిశు మరణాలు తగ్గించేందుకు జిల్లాలో వారంలోపు కాన్పు అయ్యే మహిళలు , హై రిస్క్ గర్భవతులను గుర్తించి జాబితా సిద్ధంతో అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటికే ఆదేశించిన మేరకు సిబ్బంది నియామకం జరగాలని, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. ముఖ ఆధారిత హాజరు వంద శాతంగా ఉండాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ 104 పర్యటనలో గర్భవతుల డేటా అందుబాటులో ఉండాలని అన్నారు. గర్భిణీలకు అన్ని ఆసుపత్రులలో ప్రసవ సమయంలో బెడ్ల అందుబాటును జాబితా మేరకు గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న పోస్టులను రానున్న జనవరి 15 లోపు భర్తీ చేయాల్సి ఉంటుందని అన్నారు. బైజుస్ ట్యాబ్ ల పంపిణీ ఎట్టి పరిస్థితిలలోనూ రీ సెట్ చేయకుండా పిల్లలకు సూచనలు ఇవ్వాలని ట్యాబ్ లో రీ సెట్ జరిగితే తిరిగి ఓపెన్ కాదని పనికిరాకుండా పోతుందనే మెసేజ్ అందరికీ తెలియాలని అన్నారు. నాడు – నేడు లో అభివృద్ధి చేసిన స్కూల్ లలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. రీ సర్వే ప్రక్రియ వేగవంతం కావాలని ఆదేశించారు.

అలాగే గౌ. ముఖ్యమంత్రి సలహాదారు సమీర్ శర్మ సూచించిన మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా వాలంటీర్ లు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం లు ప్రత్యేక శ్రద్ద వహించి నిర్దేశిత 8 ఇండికేటర్ లు, 4 పారా మీటర్ల వారిగా రక్త హీనత, పోషకాహార లోపం లేకుండా ప్రత్యెక చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియా తగ్గించుట, పౌష్టికాహారం, జగనన్న గోరు ముద్ద, ఐరన్ మాత్రలు అందేలా వైద్య మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ, డి.ఈ.ఓ, సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకొని పురోగతి చూపించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. శ్రీనివాస రావు, ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖా అధికారిణి జయలక్ష్మి, డ్వామా పిడీ శ్రీనివాస ప్రసాద్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి.పి.ఓ. రాజశేఖర్ రెడ్డి, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకర్ నారాయణ, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి యుగంధర్, ఎస్.సి సంక్షేమ అధికారి చెన్నయ్య, డి.ఈ.ఓ. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *