Breaking News

స్కిల్ హబ్ మరియు స్కిల్ కాలేజీ లతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా… (సక్సెస్ స్టోరీ)

సక్సెస్ స్టోరీ

-నైపుణ్య శిక్షణలు, జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు
-తిరుపతి జిల్లాలో జాబ్ మేళా ద్వారా 1113 మందికి ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు విద్యతో పాటు అంతర్జాతీయ నైపుణ్యాన్ని పెంపొందించాలనే సంకల్పం… దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా జిల్లాల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నిష్ఠాధితులు చేత బహుళ జాతి రంగాలలో శిక్షణలు ఇస్తూ.. యువత జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తుంది.

యువతలో నైపుణ్యాభివృద్ధి వికాశాన్నికి కృషి చేయడం కోసం.. స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశయంతో జిల్లాల్లో వివిధ కోర్సులలో శిక్షణ ఇప్పించి శిక్షణ పూర్తయిన వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి తల్లిదండ్రుల కలలను యువత సాకార చేసుకునే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది.

తిరుపతి జిల్లాలోని సత్యవేడు, సూళ్ళూరుపేట, తిరుపతి, వెంకటగిరి, గూడూరు, శ్రీ కాళహస్తి ,చంద్రగిరి నియోజక వర్గంలో 7 స్కిల్ హబ్ కేంద్రాల్లో భాగంగా 4 స్కిల్ హబ్ కేంద్రాలు అయినా సూళ్ళూరుపేట, తిరుపతి, వెంకటగిరి, చంద్రగిరి స్కిల్ హబ్ కేంద్రాలలో 210 మంది ట్రైనింగ్ పొందుతున్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఉచితంగా వసతి మరియు భోజనాలు సదుపాయాలు కల్పించి సాంకేతికపరమైన అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారికి మల్టీ నేషనల్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. పదవ తరగతి లేదా పై చదువులు చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సులోపు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. జిల్లాలోని ఎంప్లాయిమెంట్, సీడప్ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో తిరుపతి జిల్లాకు చెందిన సుమారు 1113 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.

తిరుపతి జిల్లాలో జరిగిన జాబ్ మేళా ద్వారా ఎంపికైన వారీ వివరాలు:
ఇండస్ట్రీ కస్ట మైడ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా 7 కంపెనీలకు సుమారు 300 మంది యువత హాజరూ కాగా 119 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
శ్రీ వి ఎస్ ఎస్ సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సూళ్లూరుపేట జరిగిన జాబ్ మేళాలో 350 మంది హాజరు కాగా 156 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతి లో జరిగిన జాబ్ మేళాకు 56 మంది హాజరు కాగా 18 మంది యువత ఉద్యోగానికి ఎంపికయ్యారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నాయుడుపేట లో జరిగిన జాబ్ మేళా కు 82 మంది యువత హాజరూ కాగా 34 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
తిరుపతి గీతం ఇన్స్టిట్యూషన్స్ లో జరిగిన జాబ్ మేళాకు 254 మంది హాజరు కాగా 134 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
జడ్ పి పి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గూడూరు లో జరిగిన జాబ్ మేళా కు 250 మంది హాజరు కాగా 109 మంది యువత ఉద్యోగానికి ఎంపికయ్యారు.
ప్రభుత్వ ఐటిఐ కాలేజీ వెంకటగిరి నందు జరిగిన జాబ్ మేళాకు 437 మంది హాజరు కాగా 85 మంది యువత ఉద్యోగానికి ఎంపికయ్యారు.
ప్రభుత్వ ఐటిఐ కాలేజీ తిరుపతి రూరల్ నందు జరిగిన జాబ్ మేళాకు 242 మంది హాజరు కాగా 125 మంది యువత ఉద్యోగానికి ఎంపికయ్యారు.
జడ్ పి ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల శ్రీకాళహస్తి లో జరిగిన జాబ్ మేళా కు 642 మంది హాజరు కాగా 333 మంది యువత ఉద్యోగానికి ఎంపికయ్యారు.
చాలా సంతోషంగా ఉంది

నా మీరు అజయ్ సూళ్లూరుపేట మన్నారు పోలూరు లో నివసిస్తున్నాను. మాది మధ్య తరగతి కుటుంబం మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. నేను తడ ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో వెల్డర్ కోర్సు పూర్తి చేశాను. వెల్లర్ కోర్సు పూర్తి చేసిన నేను ఇంటి దగ్గర ఉంటేనే ఉద్యోగం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. అనుకోకుండా ఒక రోజు ఫేస్ బుక్ ద్వారా ఏ పి ఎస్ ఎస్ డి సంస్ధ గురించి తెలుసుకొని 45 రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణ అనంతరం శ్రీసిటీ లోని ఆల్ స్టో మ్ లో సంవత్సరానికి 2 లక్షల 50 వేల ప్యాకేజ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. మా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. నా ఖర్చులకు అమ్మానాన్నలపై ఆధారపడకుండా ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాము.

నా కల నెరవేరింది :
నా పేరు క్రాంతి నేను సూళ్లూరుపేట టౌన్ లో నివసిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. నేను తడ ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో వెల్డర్ కోర్సు పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చాలా నిరాశ చెందాను. మా నా స్నేహితుల సహాయంతో నేను ఏ పి ఎస్ ఎస్ డి సంస్ధ వారిని సంప్రదించి 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణ అనంతరం శ్రీసిటీ లోనీ ఆల్ స్టో మ్ లో ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం చేయాలనే నా కల నెరవేరింది. నిరుద్యోగ యువతీ యువకులకు త్వరగా ఉద్యోగం పొందడానికి ఇది చక్కని వేదిక అని చెప్పడానికి గర్వంగా ఉంది.

కుటుంబానికి అండగా నిలిచాను:
నా పేరు అనిల్ నేను సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ పుత్తూరు లో డిప్లమా మెకానిక్ పూర్తి చేశాను. మానాన్న లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా తల్లిదండ్రులకు అండగా ఉండడానికి నేను ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలకి హాజరు కావడం జరిగింది. ఉద్యోగ అవకాశం రాక నిరాశ పొందాను. నా స్నేహితుల సహాయంతో ఏ పీ ఎస్ ఎస్ డీ సీ ద్వారా ఇండస్ట్రీ కష్టమైడ్ సిల్క్ ట్రైనింగ్ లో 45 రోజులు శిక్షణ పొందిన అనంతరం అల్ స్టో మ్ కంపెనీలో ఉద్యోగo చేస్తున్నాను. నాకు ఈ ఉద్యోగo అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

యువతకు ఉద్యోగ భద్రత : తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి
జిల్లాలో ఉన్న నైపణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలలో వివిధ అంశాలలో యువతకు శిక్షణ ఇప్పిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు వివిధ జాబ్ మేళాల ద్వారా చాలామందికి వివిధ సంస్థల్లో, పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని జాబ్ మేళా నిర్వహించి మరింతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *