విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయి చేతిరాత పోటీలకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కుమారుడు జివితేష్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్ అభినందించారు. జాతీయస్థాయి కాలిగ్రఫీ చేతిరాత ప్రత్యేక నిపుణులు భువనచంద్ర తరపున జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజభవన్ లో అభినందించారు. ఆంగ్ల భాషలో చూడచక్కని చేతిరాతను చూసిన గవర్నర్ జివితేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. చేతిరాత ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించవచ్చునని చదువుతోపాటు అందంగా రాయడం ఒక కళ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయి చేతిరాత ప్రత్యేక నిపుణులు పి భువనచంద్ర తో పాటు కాకినాడ శాసనసభ్యుల కుమార్తె కురసాల సిరి కృష్ణ సంహితఅంజలి, ఏలూరుకు చెందిన జేఎన్ జె స్కూలు, జయశ్రీ హోలీ ట్రినిటీ ,డమరేష్ శుభోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శ్రావ్యాంజలి చైతన్య స్కూల్, స్ఫూర్తి సిద్ధార్థ స్కూల్,హర్షిత నేతాజీ స్కూల్, మనుశ్రీ ప్రభుత్వ పాఠశాల విశాఖపట్నం విద్యార్థులను గవర్నర్ అభినందించారు.
Prajavartha Online Telugu News