విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీతారామం ఫేం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విజయవాడలో సందడి చేసింది. బందర్ రోడ్డు లో నూతనంగా లక్కీ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీతారామం మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, మాజీ ఎంపీ గోకరాజు గంగ రాజు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, వైస్సార్సీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్ లు పాల్గొన్నారు. విజయవాడ లాంటి మహా నగరం లో లక్కీ షాపింగ్ మాల్ వస్త్ర సముదయాన్ని ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం శ్రీనివాస్, రత్తయ్య, స్వామి లను అభినందించారు. విశాఖ నగరం లో లక్కీ షాపింగ్ మాల్ తో ట్రెండ్ సృష్టించిన యాజమాన్యం విజయవాడ లో ఆరో బ్రాంచ్ నెల్కొల్పడం హర్షణీయమని వాళ్ళు కొనియాడారు. నాలుగు అంతస్థుల విశాల భవనం లో లేడీస్, జెంట్స్, కిడ్స్ రెడీ మెడ్, వేరేటీస్ తోపాటు పట్టు వస్త్రాలను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం స్వాగతస్తున్నామని పేర్కొన్నారు. లక్కీ షాపింగ్ మాల్ ని ప్రారంభించిన సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. షో రూమ్ లో నాలుగు అంతస్తులో సందడి చేశారు. కంచి పట్టు చీరలను ఆసక్తిగా తిలకించిన ఆమె వాటిని ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు. న్యూ ఇయర్ పండుగ సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని లక్కీ షాపింగ్ మాల్ అందిస్తున్న బంపర్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి జోగి రమేష్ కు లక్కీ షాపింగ్ మాల్ ఓనర్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియ జేశారు. తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందించడం లక్కీ షాపింగ్ మాల్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులు తమను అందరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News