Breaking News

సమర్ధవంతంగా పనితీరు చూపడానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పురోగతి, ఆరోగ్య పరిరక్షణపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మరింత సమర్ధవంతంగా పనితీరు చూపడానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రీసర్వే భూహక్కు, రక్షా పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ల వారి జిల్లాల వారీగా ప్రగతి పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు వెలగపూడి నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కె. మాధవీలత మాట్లాడుతూ, పిల్లలు, గర్భిణీ, బాలింతలలో సంపూర్ణ ఆరోగ్య స్థితి సాధించే దిశగా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు అమలు చేయడం కోసం నిబద్దత తో కలిసి పనిచేయాలని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 12216 మందికి గాను 11542 మందికి పోస్టికాహర పరీక్షలు నిర్వహించగా లోపాలు ఉన్న 33.80 శాతం మందిలో కి పూర్తి స్థాయి బలవర్థక ఆహారం అందించినట్లు తెలిపారు. జిల్లాలో 19135 మంది పిల్లలకు ,40785 పోషకాలతో కూడిన కిట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు . బడి బయట ఉన్న పిల్లలను 1075 మందిని గుర్తించినట్లు తెలిపారు. బాలికల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ లో 1562 టాయ్ లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

జాతీయ ఉపాధి హామీ కింద 37 లక్షల పనిదినాలు కుగాను 41.68 లక్షల సాధించడం జరిగిందని, సగటు వేతనం రూ.220.71 ల మేర ఇవ్వడం జరుగుతున్నట్లు, వాటిని రు.250 లుగా పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ డబ్ల్యు షేడ్స్ 300 లకు గాను 270 పూర్తి చేసి, మరో 27 కొత్తగా మంజూరు చేసినట్లు, వాటిని పూర్తి స్థాయి లో అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. 224 చోట్ల పూర్తి స్థాయి లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ టాయ్ లెట్స్ 392 కి గానీ 345 చోట్ల పనులు ప్రారంభించగా 216 పూర్తి చేశారన్నారు. గ్రామ సచివాలయాలు 306, అర్భికే లు 239, హెల్త్ క్లినిక్స్ 163 భవనాలు జిల్లాలో పూర్తి చేశామని, గత రెండు వారాల లో 75 సచివాలయాలు, 111 అర్భికే లు, 163 హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులు అనుకున్న స్థాయి లో స్టేజ్ కన్వర్షన్ జరగటం లేదని, వెంటనే ఆయా పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 283 పంచాయతీలు, 516 జగనన్న హౌసింగ్ లేఅవుట్ లలో చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశాలకు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్ డి ఒ జి. నరసింహులు, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *