తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అనుమతులు పొంది ఇంకా ప్రారంభించని క్వారీలను సత్వరమే ప్రారంబించేలా చర్యలు తీసుకోవాలని మైనింగ్ మరియు ఎన్విరోన్మెంటల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. బుదవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్వారీ లీజులు పొంది ఇంకా ప్రారంభంకాని సుమారు 117 యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మైనింగ్ నుండి అనుమతులు పొంది ఇంకా ప్రారంభించని క్వారీలు సత్వరమే ప్రారంభించాలని, లేనిచో తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో షోకాజ్ నోటీసులు అందినా కూడా క్వారీల ప్రారంభానికి తదుపరి చర్యలు చేపట్టని 25 క్వారీలపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన క్వారీలు తొందర్లోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెన్యువల్స్, బదిలీలకు ఆన్ లైన్ లో చేసుకున్న దరఖాస్తులను ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ బోర్డ్ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమతులను మంజూరు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఉప సంచాలకులు చిత్తూరు ప్రసాద్, నెల్లూరు సూర్యచంద్రరావు, పొల్యూషన్ కంట్రోల్ ఏ.ఈ మదన్మోహన్ రెడ్డి, ఈ .ఈ నెల్లూరు రాజశేఖర్, ఏ డి చిత్తూరు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News