విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ వసతి గృహాల నిర్వహణను అధికారులు తరచూ పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కస్తూరిబాయ్ పేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల ప్రత్యేక వసతి గృహాన్ని బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇటీవల 8వ తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబ్ లలోని పాఠ్యాంశాలను, టెస్ట్ బుక్స్ లోని పాఠ్యాంశాలను సరి చూసి విద్యార్థుల నుండి సమాధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆడియో వీడియోల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ గారు రూపొందించిన పాఠ్యాంశాలు ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు కలెక్టర్ కు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పంది పుచ్చుకొని కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడాలన్నారు. మండల, డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను తరచూ తనిఖీలు చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, పాఠ్యాంశాలు,విద్యాపరమైన విషయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా… టాయిలెట్స్, డైనింగ్, బెడ్స్ వంటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించాలన్నారు. అదేవిధంగా సంక్షేమ వసతి గ్రహాలలో టాయిలెట్స్ పరిసరాల పరిశుభాన్ని పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తగిన సమాచారంతో నివేదిక అందించాలన్నారు. వసంత గ్రహాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం తప్పనిసరిగా అందించాలని, సౌకర్యాల కల్పనలో లోటుపాట్లు గుర్తిస్తే సంబంధిత వార్డెన్ లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల ప్రత్యేక వసతి గృహంలో పరిసరాలు, ఫ్లోరింగ్,టాయిలెట్స్ , డ్రైనేజీ నిర్వహణ సక్రమంగా లేకపోవటాన్ని కలెక్టర్ పరిశీలించి తక్షణమేసరి చేయించాలని వార్డెన్ ను కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News