-ఉపాధి హామీ కూలీల సంఖ్య మరింత పెరగాలి
-సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలను అన్ని శాఖలు సమన్వయంతో సాధించాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10 నుండి 19 సంవత్సరాల బాలికలు మరియు గర్భిణీ స్త్రీ లు అనీమియా బారిన పడకుండా మరియు పాఠశాలలో విద్యార్థుల నమోదు నిష్పత్తి మెరుగుపడేలా, బడి బయటి పిల్లలు బడిలో చేరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఆదేశించారు. అమరావతి నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి విద్య వైద్యం పంచాయతీరాజ్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి గురువారం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలనీ పునాది స్థాయి నుండి స్టేజి వారిగా పురోగతి ఉండాలని సూచించారు. ముఖ ఆధారిత హాజరు అమలు చేయాలని తెలిపారు. రక్తహీనత తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల పై ప్రత్యేక దృష్టి సారించి వారికి సరైన పౌష్టికాహారం అందించాలని, మాతా శిశు మరణాలు జరగకుండా చూడాలని అన్నారు. బాలింతలకు చిన్నపిల్లలు బరువు తక్కువ కలవారిని చురుకుదనం ఎదుగుదల లోపం తగ్గించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారాన్ని అందించాలని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని దీనిపై విస్తృత ప్రచారం అవసరమని అన్నారు. మనబడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని డ్వామా అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం స్థాయి వరకు సమన్వయం తో సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేలా అన్ని శాఖలు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకరనారాయణ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయకుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి డిఎంహెచ్వో శ్రీహరి సిపిఓ అశోక్ కుమార్ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News