Breaking News

భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కి సంబంధించిన ఈ కే వై సి పక్రియను వేగవంతం చేయాలి

-రెండవ దశ రీ సర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలి
-సి సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణి, ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను జే సి లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో స్పెషల్ సి ఎస్ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగ జిల్లా కలెక్టర్ నుండి జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజి, డి.ఆర్.ఓ శ్రీనివాసులు, ఏ.డి సర్వే జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ శాశ్వత జగనన్న భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు జే సి లతో సమీక్షించారు.. మ్యూటేషన్స్ కోసం అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను జే సి లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ… వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ వేగవంతం చేయాలని అన్నారు. ఇంకా పూర్తి కాని భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ చేసిన వెంటనే సంబందిత రైతుల నుంచి ఈ.కె.వై.సి ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రెండవ దశ రీసర్వేకు సంబంధించి 202 గ్రామాలకు గాను 11 గ్రామాల లో పనులు పూర్తవడం జరిగిందని మిగిలిన గ్రామాలలో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. సర్వే ప్రక్రియలో భాగంగా 74 -ఫైనల్ ఆర్.ఓ ఆర్, 80 డి.ఎల్.ఆర్ కు సంబంధించిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. మ్యూటేషన్స్ కోసం అందిన ధరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *