Breaking News

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ బాధితులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్

-డా. బి ఆర్. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సద్వినియోగం మాత్రమే చేసుకోవాలి: ఆదిమూలం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్.సి, ఎస్.టి వర్గాలకు ఎప్పటికీ అండగా ఉంటూ న్యాయం చేయడానికి ముందుంటుందని, ఏదైనా సమస్య ఉంటే సకాలంలో తెలిపితే తప్పక సత్వర చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రెండవ సమావేశం నిర్వహించగా ఎం.ఎల్.సి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎస్.పి. పరమేశ్వర్ రెడ్డి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు,ఆర్.డి.ఓ.లు కనకనరసా రెడ్డి, కిరణ్ కుమార్, రామారావు కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, కమిటీ కన్వీనర్ చెన్నయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి, ఎస్.టి లకు సంబంధించిన కేసులు 84 నమోదు అయ్యాయని, ఎఫ్.ఐ.ఆర్., చార్జి షీట్ అయిన బాదితులకు మానిటరీ రిలీఫ్ ద్వారా రూ.62.20 లక్షలు నిర్దేశించిన సమయానికి చెల్లించడం జరిగిందని వివరించారు. గత త్రైమాసికం లో సెప్టెంబర్ ఆఖరి వరకు 39 కేసులు నమోదు కాగా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 21 కేసులు నమోదు అయ్యాయని, కేసులు తగ్గుముఖం పట్టాయని శుభపరిణామం అని అన్నారు. ఈ డిసెంబర్ త్రైమాసికం వరకు 57 కేసులు పరిశోధన దశలో పురోగతిలో ఉన్నాయని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇంకా హరిజనవాడలు అని ఉన్నాయని వాటి పేరు మార్పుకు చర్యలు తీసుకోవాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ డిపిఓ వారు గ్రామాల్లో గ్రామసభ తీర్మానం చేసి పంపాలని గెజిట్ వెలువడిన తర్వాత పేరు మార్పు జరుగుతుందని తెలిపారు.

ఎం ఎల్ సి మాట్లాడుతూ గూడూరు నియోజక వర్గంలో ఒక అమ్మాయికి మోకాలి కీలు ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం అవసరం ఉన్నప్పుడు కలెక్టర్ గారు సత్వరమే స్పందించి రూ.1.45 లక్షలు సత్వరమే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. గ్రామాల్లో శాంతి భద్రతలు ఉండాలంటే అందరు కలిసి మెలసి ఉండాలని అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని ఆయన రచించిన రాజ్యాంగం వలన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయని దానిని దుర్వినియోగ పరచరాదని అన్నారు. సద్వినియోగం చేసుకొనేకి మాత్రమే ఉపయోగించాలని అభిప్రాయ పడ్డారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల నమోదులో ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు గానీ, తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని సభ్యులకు సూచించారు. సమావేశ ప్రారంభంలో కన్వీనర్ చెన్నయ్య గత సమావేశ నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు.

ఈ కమిటీ సమావేశంలో అధికారిక సభ్యులుగా ఉన్న జిలా ఆడిట్ అధికారి జయపాల్ సభ్యులు ప్రసాద్ బాబు, వెంకటేశ్వరులు, మహేష్, సోమలమ్మ, సురేష్, ఎన్.జి.ఓ మెంబర్లు రోప్ సంస్థ మునిరామిరెడ్డి, ప్రగతి వెంకటరమణా, ఎ బి ఎం ఎం వెంకటాచలం, పోలీసు అధికారులు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *