-సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు వేణుగోపాల్, తానేటి వనిత, కలెక్టరు మాధవీలత, యం.పీ భరత్, ఇతర ప్రజాప్రతినిధులు.
-జిల్లా స్థాయి సంక్రాంతి వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాల్..
-సంప్రదాయ పిండి వంటలు అరిసేలు, జంతికలు వండిన హోం మంత్రి వనిత, కలెక్టరు మాధవీలత
-అలరించించిన సాంస్కృతి ప్రదర్శనలు, ముగ్గులు పోటీలు, బోగి మంటలు, కోలాటం, ఇతర సాంప్రదాయ నృత్యాలు
-సాంప్రదాయ ఎడ్లబండి పై సవారి చేసిన మంత్రులు, యంపి, కలెక్టరు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కృతికీ సంప్రదాయాలకు వేదికైన తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, యంపి మార్గాని భరత్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ స్టేడియంలో నగరపాలక సంస్థ, రుడా ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జిల్లా ఇన్ఛార్చి, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల సినీమాఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి మన పండుగని రైతులు పంటలను ఇంటికి తీసుకువచ్చే ఆనంద సమయం అన్నారు. దూరప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒకే చొట కలిసే అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అన్నారు. నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో సంస్కృతి, సంప్రదాయ, సంస్కార వేదికైన రాజమహేంద్రవరంలో ఈ సంక్రాంతి పర్వదినాన్ని సహచర మంత్రి తానేటి వనిత, యం.పి. మార్గాని భరత్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, కలెక్టరు మాధవీలత తో కలసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబాలు దూరంగా ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్బంగా అందరం ఒక్కటై ఆనందాలతో జరుపుకునే సంప్రదాయ పండుగ సంక్రాంతి అన్నారు. మకర సంక్రమం యొక్క ప్రాముఖ్యతను భారతీయ సంస్కృతిలో మన పూర్వీకులు వెల్లడించడం జరిగిందన్నారు. ఈ రోజు నుండి పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించడానికి చిహ్నంగా ప్రతి ఇంటిలో జరుపుకుంటామన్నారు. ఈ వేడుకల్లో గంగిరెద్దులు, తోలుబొమ్మలు, బుడబుక్కలు, హరిదాసులు తదితర ఎన్నో సంప్రదాయ కళలకు వెన్నెముఖగా వెనుకబడిన వర్గాల జీవనోపాధి సాగింస్తూ దేశ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బీసీ వర్గాలను ప్రభుత్వానికి వెన్నెముక గా గుర్తించి సముచిత మైన స్థానాన్ని కల్పించారన్నారు.
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంకక్షలు తెలియజేస్తున్నాన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో ప్రజలు యాంత్రికంగా జీవనాన్ని కొనసాగిస్తున్న తరుణంలో మన సంస్కృతిని భవిషత్ తరాలకు అందించడంలో ప్రతి కుటుంబం సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగను కలిసి జరుపుకునే ఆవశ్యత ఉందన్నారు. రాజమహేంద్రవరంలో అంబరాన్ని అంటేలా సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. నగరంలో ఒక రోజు ముందుగానే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయని జగనన్న ప్రభుత్వంలో ప్రతి రోజు పేదవారికి సంక్రాంతి పండుగేనని మంత్రి అన్నారు. తెలుగు వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునే విధంగా సంక్రాంతి వేడుకలను జరుపుకుని భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు.
సంక్రాంతి సంబరాల నిర్వాహుకులు స్థానిక యంపి మార్గాని భరత్ మాట్లాడుతూ తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలసి సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. మన దేశ సంస్కృతిలో ముఖ్యమైన పిండి వంటలను వండు కోవడం, ఒక కొత్త అనుభూతినిచ్చిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, సంక్రాంతి వేళ వారి ఆనందం రెండింతలవడం రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు.
జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా నూతనంగా ఏర్పడిన తరువాత తొలిసారి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నామని మన జిల్లాలో ఒక రోజుకు ముందుగానే వచ్చిందని అందుకు ఈ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమాల శోభ ప్రతిబింబిస్తున్నాయన్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని ప్రతి వారు చెప్పుకుంటారన్నారు. ఈ సంక్రాంతి సమయంలో రాయలసీమ ప్రాంతం వారు ఇక్కడకు వచ్చి సంక్రాంతి వేడుకలను తిలకించి ఆనందిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఖరీఫ్ లో రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబందించి సొమ్ము నేరుగా వారి ఖాతాలకు జమ చేసి వారి ఇంట నిజమైన సంక్రాంతిని ప్రభుత్వం తెచ్చిందన్నారు.
రుడా చైర్ పర్సన్ యం. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలకు అన్ని సంక్షేమ పథకాల అమల్లో అగ్రతాంబూలం ఇవ్వడం ద్వారా మహిళలపై తనకున్న నమ్మకాన్ని చాటుతున్నారన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అందించి వారి అభ్యున్నతికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన్నారు.
మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయ విలువలు ప్రతిబింబించే విధంగా ప్రజా ప్రతినిధుల సహకారంతో నగరపాలక సంస్థ ఆద్వర్యంలో అత్యం ఘనంగా సంక్రాంతి వేడుకలను చేపట్టి విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నేడు నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని తెలియజేస్తాయన్నారు.
శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, జగనన్న పాలనలో రాష్ట్ర మరింతగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నామన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతోందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, ఖాతిబోర్డు చైర్ పర్సన్ పిల్లి నిర్మల, సంప్రదాయ నృత్య కళాకారులు, బాలబాలికలు, జిల్లా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News