రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
టెలికాం రంగంలో నూతనంగా రానున్న సాంకేతిక పరిజ్ఞానం 4జి, 5 జి ఆధునీకరణ లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో 4 జి, 5 జి సాంకేతిక పరిజ్ఞానం కోసం ఎటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వ వలసిన అవస్యకత లేదనీ తెలిపారు. ఈ విషయంలో టెలికం వెండర్స్ నుంచి జిల్లా పరిధిలో పెండింగ్ పనులు ఏమియు చేపట్ట వలసిన అవసరం లేదని అన్నారు.
Prajavartha Online Telugu News