గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో కాలంలో గుంటూరు నగరంలో త్రాగు నీటి సరఫరాలో సమస్యలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు కమీషనర్ కీర్తి చేకూరి తెలియచేశారు. మంగళవారం గుంటూరు నగరంలోని యల్.యల్.ఆర్ రిజర్వాయర్ కు నీటిని సరఫరా చేయుట సంగం జాగర్లమూడి వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. పర్యటనలో తొలుతగా జాగర్లమూడి ప్లాంట్ నుండి ఎంత వాటర్ యల్.యల్.ఆర్ రిజర్వాయర్ కు సరఫరా అగుతుంది, త్రాగు నీటి సరఫరా సమయాలు, క్లోరినేషన్ వంటి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అదిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంగం జాగర్లమూడి లోని రిజర్వాయర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1948లో నిర్మాణం ప్రారంభించి 1956 లో ప్లాంటును వినియోగంలోకి తెచ్చారన్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా నగరంలో నాజ్ సెంటర్ లోని యల్.యల్.ఆర్ పరిధిలోని గృహాలకు త్రాగునీరు సరఫరా అవుతుందని తెలియచేశారు. ఇంజనీరింగ్ అధికారులు త్రాగు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించావద్దని, నీటి శుద్ధి జరుగు సమయంలో నీటిలో క్లోరిన్ సమపాళ్ళలో ఉన్నది లేనిది తనిఖీ చేయాలన్నారు. రానున్న వేసవికాలంలో గుంటూరు నగరంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లీకులు ఏమైనా ఏర్పడి ఉంటె వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నూతన ప్లాంట్ ద్వారా 25 మిలియన్ లీటర్స్ పర్ డే (యం.యల్.డి) త్రాగు నీరు సరఫరా అవుతున్నదని, మరమ్మతులకు లోనైన పాత ప్లాంట్ ను కూడా మరమ్మతు చేసి వినియోగంలోకి తెస్తే మరో 25 యం.యల్.డి త్రాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.
సదరు పర్యటనలో నగర పాలక సంస్థ యస్.ఈ భాస్కర్, ఈ.ఈ శాంతిరాజు ఇతర ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News