-రాష్ట్రంలోని తిరుపతి మిడ్ వైఫరీ శిక్షణా కేంద్రం మొదటిది.
-మిడ్ వైఫరీ మొదటి శిక్షణ పొందినవారు ఆదర్శంగా నిలవాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోనే మిడ్ వైఫరీ మొదట శిక్షణ పొందిన 30 మంది సిజియరిన్ లేని ప్రసవాలు డాక్టర్లకు ఏమాత్రం తీసుకోమని నిరూపించి మిడ్ వైఫరీ లు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో మిడ్ వైఫరీ లెడ్ కేర్ యూనిట్ లను ప్రారంభించి, అంతర్జాతీయ మిడ్ వైఫరీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మిడ్ వైఫరీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యపరంగా జిల్లా యంత్రాంగం ఎప్పుడు మీకు సహకారం అందిస్తుందని అన్నారు. నేడు మిడ్ వైఫరీ లెడ్ యూనిట్ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యలను చేసినందుకు ధన్యవాదాలని రాష్ట్రంలోనే తిరుపతిలో మొదటి మిడ్ వైఫరీ లెట్ యూనిట్ ఏర్పాటు కావడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోనే ఒక్క మన రాష్ట్రం మాత్రమే ప్రతి సచివాలయ పరిధిలో హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ అన్నది ప్రస్తుతం అన్ని రంగాలు అటువైపు చూడడం చూస్తున్నామని, అవసరం కూడా అని అన్నారు. గతంలో పెరుగుతున్న జనాభాకు ఆహార ధాన్యాల కొరత రాకుండా గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటుతో ఆహార ఉత్పత్తులను పెంచగలిగామని అందులో వాడుతున్న రకరకాల మందుల వల్ల భూమి ,వాతావరణం కాలుష్యం అవుతున్న కారణంగా నేడు మనం తిరిగి పాత పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు.
నేడు అదే రీతిలో మిడ్ వైఫరీ అవసరమని గుర్తించి యునిసిఫ్ సహకారంతో శిక్షణ ఇవ్వడం సంతోషం అని అన్నారు. గతంలో ప్రసవాలు గ్రామంలో మిడ్ వైఫరీ లు ఇంటి వద్దనే చేయడం జరిగేదని, మా తల్లి గారు కూడా ఇంకా నాకు పురుడు పోసిన సుగుణమ్మను గుర్తుచేస్తూ ఉంటుందని మన మధ్య లేకపోయినా వారు మన మనసుల్లో ఉంటారని అన్నారు. నేడు మీకు ఆ స్థానం దక్కిందని శిక్షణ ఇచ్చి సాధారణ ప్రసవాలు జరిగేలా బాధ్యత మీపై ఉందని సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. గతంలో ప్రసవాల కోసం ఆసుపత్రులకు రావాలని భయపడేవారని, ఇంటి వద్ద కుటుంబ సభ్యుల మధ్య ప్రసవాలు జరుపుకోవడం ఆ గ్రామ మిడ్ వైఫరీ చూడడం జరిగేదని , ఎలాంటి శిక్షణ లేకనే అనుభవంతో సుఖ ప్రసవాలు చేసేవారని , నేడు మీకు శిక్షణ అందించి హై రిస్క్ లేని గర్భవతుల ప్రసవాలు మీరే నిర్వహించేలా చూడాలని సూచించారు. శిక్షణ లేని మిడ్ వైఫరీ లు ఉన్నందున ఆసుపత్రుల లోనే ప్రసవాలు జరగాలని నిర్ణయించామని, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మీ వంతు సహకారం అందించి ఆసుపత్రులపై భారం తగ్గించే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోము అనే విధంగా వైద్య సేవలు అందిస్తూ మరింత మందికి మీరు శిక్షణ ఇవ్వగలిగేలా ఉండాలని రాష్ట్రంలోని ఫస్ట్ బ్యాచ్ ది బెస్ట్ బ్యాచ్ అని నిరూపించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా మిడ్ వైఫరీ లెడ్ యూనిట్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించి వాటి వినియోగం ఉపయోగాలపై సంబంధిత డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ వార్డులో పర్యటించి అందుతున్న వైద్య చికిత్సలను పరిశీలించారు.
ఎస్. పి. గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ Dr.Ch.మరియా రోజమ్మ , ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.పార్థసారధి, సూపరింటెండెంట్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ డా. రాధా రెడ్డి , UNICEF డాక్టర్ శ్రీధర్ ర్యావంకి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ కె.నాగమునేంద్రుడు, ఎస్. వి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ P.A.చంద్రశేఖరన్ , డీఎంహెచ్వో డాక్టర్.యు.శ్రీ హరి , మిడ్‌వైఫరీ అధ్యాపకురాలు శ్రీమతి బి.ఎస్.హేమలత, డాక్టర్ భారతి, మిడ్ వైఫరీ విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News