Breaking News

జిల్లాలో వైఎస్సార్‌ కళ్యాణమస్తు మరియు వైఎస్సార్‌ షాదీ తోఫా కింద 418 మంది లబ్ధిదారుల తల్లుల ఖాతాలలో రూ. 3.34 కోట్లు జమ: మంత్రి రోజా

-వైఎస్సార్‌ కళ్యాణమస్తు మరియు వైఎస్సార్‌ షాదీ తోఫా పేద కుటుంబాలకు ఒక వరం:కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి2023 –మార్చి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం, తాడేపల్లి నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్‌ నొక్కి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో గౌ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జమ చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి తో కలిసి గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ఆర్ కె రోజా సంబంధిత అధికారులు, లబ్దిదారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ జిల్లాలో నేడు వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వై.యస్.ఆర్ షాది తోఫా కింద 418 మంది లబ్ధిదారులకు రూ.3.34 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అని తెలిపారు. గడచిన 6 నెలల్లో అందించిన, ఇప్పుడు అందిస్తున్న వైఎస్సార్ కల్యాణమస్తు మరియు షాది తోఫా సాయంతో కలిపి రాష్ట్రంలో 16,668 మంది పేద కుటుంబాల పెళ్లి కూతుళ్లు తల్లుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. విద్యకు, వైద్యానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని అన్నారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా లబ్ధిదారులకు అందజేయగలుగుతున్నామని అన్నారు.

పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఆడ పిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు.

వధూవరులు ఇద్దరికీ 10 వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ను తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పని సరిగా వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్ళు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం నిర్దేశించింది అని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధ ద్వారా అత్యంత పారదర్శకంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ల క్రింద అర్హులైన లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని అన్నారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గర లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలనీ, సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వివరాలను ధృవీకరించుకుని చేసిన ప్రతిపాదనల మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి, మే, ఆగష్టు, నవంబర్‌లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్ధిక సాయం ప్రభుత్వం నుండి అందచేయడం జరుగుతుందని అన్నారు.

అంతే కాకుండా పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేసి అండగా నిలుస్తున్నదని అన్నారు. అందులో భాగంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు క్రింద ఎస్సీ లకు రూ.1,00,000, ఎస్సీలకు కులాంతర వివాహాలకు రూ. 1,20,000, ఎస్టీల వివాహాలకు రూ. 1,00,000, ఎస్టీలకు కులాంతర వివాహాలకు రూ. 1,20,000, బీసీల వివాహాలకు రూ. 50,000, బీసీ కులాంతర వివాహాలకు రూ. 75,000, మైనారిటీ లకు వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 1,00,000, విభిన్న ప్రతిభావంతులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు క్రింద రూ. 1,50,000, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ. 40,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.

ఇందులో నేడు జిల్లాలో లబ్ది పొందిన వారిలో బిసి కులానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు నలుగురికి రూ.6.00 లక్షలు, బిసి కులాంతర వివాహ లబ్ధిదారులు 23 మందికి 17.25 లక్షలు, బి సి కులానికి చెందిన 164 మందికి 82 లక్షలు, మైనారిటీ కులాంతర మరియు మైనారిటీ వివాహ లబ్ధిదారులకు 23 మందికి 23 లక్షలు, ఎస్సీ కులాంతర వివాహ లబ్ధిదారులకు 10 మందికి. రూ.12 లక్షలు, ఎస్సీ లబ్ధిదారులకు 173 మందికి 1.73 కోట్లు, ఎస్టీ లబ్ధిదారులకు 18 మందికి 18 లక్షలు, ఎస్టీ కులాంతర వివాహ లబ్ధిదారులకు ఇద్దరికీ 2.40 లక్షలు లబ్ది పొందారని తెలిపారు.

అనంతరం మంత్రి రోజా వారు కలెక్టర్ తో కలిసి జిల్లాలో నేడు అర్హత కలిగిన వైఎస్ఆర్ కల్యాణమస్తు మరియు వైయస్ఆర్ షాదీ తోఫా కింద అర్హత కలిగిన 418 మంది లబ్ధిదారులకు చెందిన రూ. 3.34 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పథక సంచాలకులు డి ఆర్ డి ఏ జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, మెప్మా రాధమ్మ, డిఆర్డీఎ అదనపు పిడి ప్రభావతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, లబ్ధిదారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *