Breaking News

ప్రతి నిత్యం భగవంతుని నామస్వరన చేస్తూ ఉండాలి…

-ప్రతి ఒక్కరూ దానధర్మాలు చేయాలి
-గ్రామాలలోని ఆలయాలలో ధూప దీప నైవేద్యంతోపాటు భజన కార్యక్రమాలు నిర్వహించాలి
– నదులు కాలుష్యం చేయకుండా కాపాడాలి
-ప్రజలకు మంచి సంకల్పం కలగాలి
-చిత్తూరు జిల్లాలో అనేక పుణ్య తీర్థాలు ఉన్నాయి
-కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఘనంగా మహా అద్భుతంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ కు మహా కుంభాభిషేకం లో భాగంగా 5 వ రోజు అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్ట, కలశ ప్రతిష్ట నిర్వహించి సర్వ దర్శన భాగ్యం భక్తులకు కల్పించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి స్వామి వారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట మహా కుంభాబిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి స్వామి వారికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్. కె.రోజా,స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా యజ్ఞ శాలలో నిర్వహించే హోమం కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గర్భాలయం లో గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయం శిఖర కలశ ప్రతిష్ట మహాకుంభ సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులనుద్దశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అలయాలు పున : నిర్మాణాలు చేపట్టి కుంభాభిషేకాలు నిర్వహించాలని అప్పుడే గ్రామం,జిల్లా, రాష్టం, దేశం సుభిక్షంగా ఉంటుందని చూచించారు. గంగ పురస్కారాలు సందర్భంగా తిరుపతి లో గంగమ్మ తల్లికి మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకమని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం భవంతుని జపిస్తూ ఉండాలని, అందరూ మంచి సంకల్పం కలిగి ఉండాలి అది మీకు సమాజానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం గురించి 18వ శతాబ్దంలో కంచి కామాక్షమ్మ ఆలయంలో తెలుగులో ఇలా రాసి ఉంది “కుంబాభిషేకం చేసి న సకల జనులు సంతోషించెదరు ” అని రాసి ఉంది,తిరుపతి లో గంగమ్మకు కుంభాభిషేకం చేశారు తిరుపతి ప్రజలందరూ సంతోషంగా వున్నారు.
దేశంలో ఉండే తీర్థా క్షేత్రాలను మంచిగా శుభ్రంగా అందంగా ఉండే డానికి సకల జనులు సహకరించాలన్నారు. గ్రామాలలో ఉన్న ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు , కుంభాభిషేకాలు , హోమాలు చేయడం వల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష,ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి,ఆలయ ఈఓ ముని కృష్ణయ్య, ఆలయ ఛైర్మన్ శ్రీ కట్టా గోపి యాదవ్, ధర్మకర్తల మండలి టి. వెంకటేశ్వరరావు, యం. హరినాథ్ రెడ్డి, టి. రమణమ్మ, , పి. ధన శేఖర్, వి. కృష్ణమ్మ, వి. గీత, యన్. భారతి , స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *