Breaking News

సి ఎం.కప్ మొదటి, రెండు, మూడు బహుమతులు అందుకున్న 14 క్రీడల విజేతలు.

-జిల్లాల వారీగా ప్రతిభ కనబరిచిన విశాఖ, పచ్చిమ గోదావరి, ప్రకాశం అందుకున్న మొదటి, రెండు, మూడు బహుమతులు.
-గత 5 రోజులుగా రాష్ట్ర స్థాయి సి ఎం కప్ క్రీడలు మంచి వాతావరణంలో జరుపుకున్నాo… జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి క్రీడలు తిరుపతిలో జరగడం సంతోషమని, రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ , అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి తమవంతు ప్రయత్నం , కృషి చేయాలని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. సి ఎం కప్ ముగింపు కార్యక్రమం స్థానిక పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో సీఎం ట్రోఫీ బహుమతులను విజేతలకు అందించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓవరాల్ ఛాంపియన్షిప్ అందుకున్న విశాఖపట్నం క్రీడాకారులను, అధికారులను అందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నేను వైజాగ్ లో మెట్రోపాలిటన్ కమిషనర్ గా చేశాను . అలాగే రెండవ బహుమతి అందుకుంటున్న పచ్చిమ గోదావరి జిల్లా లో జాయింట్ కలెక్టర్ గా పనిచేశాను అన్నారు. మూడవ బహుమతి ప్రకాశం జిల్లాకు రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఓడిన వారు బాధపడాల్సిన పనిలేదు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి ఇక్కడ ఫైనల్ కు వచ్చారు, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యం, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని క్రీడలను నిర్వహించ బోతున్నది, త్వరలో మీరు చూడబోతున్నారని అన్నారు.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని తక్కువ సమయంలో దాదాపు 5500 మంది క్రీడాకారులు , కోచ్ ల కు బస, వసతి, రవాణా , గ్రౌండ్ ప్రిపరేషన్ వంటివి సమయం తక్కువగా వున్నా షెడ్యూల్ నిర్ణయించి రాష్ట్ర స్థాయి క్రీడలు తిరుపతిలో నిర్వహించడానికి అంగీకరించిన శాప్ అధికారులకు, ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించిన సి ఈ ఓ , అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి గెలుపొందిన మొదటి, రెండు, మూడు స్థానాలకు సి ఎం కప్ ట్రోఫీ లను క్రీడాకారులు అందించారు. 14 క్రీడలకు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ 3 జిల్లాలకు ఈ సి ఎం కప్ లను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ రజని , శాప్ మెంబర్ శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ ధర్మారావు, స్పోర్ట్స్ సి ఇ ఓ లు ఉమ్మడి జిల్లా చిత్తూరు మురళి కృష్ణ, విజయనగరం రామ్ గోపాల్, రిటైర్డ్ శాప్ రిటైర్డ్ ఎ డి దేవానంద్, స్పోర్ట్స్ ఏ ఓ సయ్యద్ బాషా, సీసీ చీఫ్ కోచ్ బాలాజీ, సి ఎం కప్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *