Breaking News

పాలనా వ్యవస్థలో ప్రభుత్వ కార్యాలయాలలో అధికార తెలుగు భాష వినియోగంపై పరిశీలనకు జిల్లాకు వచ్చిన రాష్ట్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు అధికార భాష అధ్యక్షులు పి. విజయబాబు మంగళవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రాతికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ ప్రాతికేయుల సమావేశంలో రాష్ట్ర అధికార తెలుగు భాష అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు అధికార భాష అమలును జిల్లాల వారిగా అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. పాలనా భాషలోనే పరిపాలన జరగాలని ఆసక్తి ఏకాభిప్రాయం అధికారులలో కలిగినట్లు గుర్తించామన్నారు. మాతృభాష తెలుగు భాషలోనే పరిపాలనలో ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించే ప్రక్రియలో కంప్యూటికరణతో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. రాబోయే కాలంలో సాంకేతిక ఇబ్బందులను తొలగించి మరింత మెరుగుగా, వేగవంతంగా అధికార భాషగా తెలుగును ఉత్తర ప్రత్యుత్తరాలలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతికంగా, భాష పరంగాను నమోనా పత్రాలను అందజేస్తున్నామన్నారు. ఆయా జిల్లాలలో ఉన్నటువంటి నిష్ట్నాతులైన సాహితీవేత్తలను ప్రాంతాల వారిగా ఎంపిక చేసి సముచితరీతిలో సత్కరించేలా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తిరుపతిలో భాషా బ్రమోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు భాష పట్ల మక్కువ, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన కూడళ్ళులో ప్రభుత్వ ప్రైవేట్‌ సమాచారం తెలిపే బోర్డులు తెలుగులో ఉండేలాను ద్విభాషా సూత్రం ప్రతిపాదికగా తెలుగు ఇంగ్లీష్‌ భాషలో తెలిపేలా నగరపాలక సంస్థ కమీషనర్‌ను కోరడం జరిగిందని త్వరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామి ఇచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అట్టడుగు స్థాయిలోని విద్యార్థులకు భవిషత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్‌ బోదన చేసే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. తెలుగు భాష అమృతం, సంజీవిని లాంటిదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భాషకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా అధికార భాష సంఘం అధ్యక్షులు, సభ్యులను నియమించి తెలుగు భాష అమలును పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు విజయబాబు తెలిపారు.ప్రాతికేయుల సమావేశంలో తెలుగు అధికార భాష సంఘం సభ్యులు జయచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ ఉన్నారు.అనంతరం తెలుగు సాహితీ ప్రముఖులతో చర్చా గోష్టి నిర్వహించారు. పలువురు సాహితీ వేత్తలు తమ అభిప్రాయాలను, సూచనలను అధికార భాష సంఘం దృష్టికి తీసుకువచ్చారు.సాహితీవేత్తలకు ఘన సత్కారం :డా. విఎస్‌ మంగాదేవి, డా. గుమ్మాసాంబశివరావు, డా. కప్పగంతు రామకృష్ణ, డా. శివకుమార్‌, డా. ఎస్‌ వెంకటేశ్వరరావు, డా. పంతుల వెంకటేశ్వరావు, డా.సత్యశ్రీనివాస్‌, డా.వి.శివరామకృష్ణమూర్తి డా. చలపతిరావు, డా. కావురి సత్యవతి,డా కె. సురేష్‌కుమార్‌, డా. నరసింహులు, డా.విజయకుమార్‌, డా.ఎస్‌ సత్యనారాయణ, డా. కన్నమనాయుడులను ఘనంగా సత్కరించారు.
ఈసందర్భంగా తెలుగు అధికార భాష సంఘ అధ్యక్షులు పి. విజయబాబు మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ నిధులు కార్యకలాపాలతో తెలుగు భాష వికాశం చెందుతుందని అనుకోవడం పొరపాటు అవుతుందన్నారు. తెలుగు భాషలో సంస్కృత భాష కలిసి ఉందన్నారు. ద్రావిడ భాష అయిన తెలుగు భాషను ఒక్కొక్క తెలుగు వాడు పది మందికి తెలుగుని నేర్పించగలిగితే త్వరలో అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందుతుందని ముందుగా జాతీయ భాష అవుతుందన్నారు. సాహితీ వేత్తలుగా మనమంత తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు కృషి చేద్దామని దీనిలో భాగంగా భాషా చైతన్య యాత్రలు నిర్వహిద్దామని విజయబాబు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *