దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్,రాణిగారితోట, శాంపిల్ బిల్డింగ్ నందు దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి. ఈ సందర్భంలో కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రజల ఆర్యోగం కోసమే దేవినేని అవినాష్ ఆయన సొంత ఖర్చులతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం 17వ డివిజన్ ప్రజలు కోసం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చి న‌ట్లు ఆయన వివరించారు. ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్‌, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు​‍ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. వేయి మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, మందులు పంపిణీ చేసాం అని అన్నారు. ప్రజలకు ప్రతి ఏడాది తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆయన సొంత నిధులు నుండి ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య నియోజకవర్గం గా తయారు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *