విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మినీ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో గల జిల్లా ఉపాధి కేంద్రంలో జరిగే ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ, బి-టెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మినీ జాబ్ మేళాలో 4 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని కలెక్టర్ ఢిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు. అసక్తి కలిగిన అభ్యర్థులు https://tinyurl.com/Minijune ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కోసం 9700092606/ 9603368324 నందు సంప్రదించాలని సూచించారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …