Breaking News

ట్రస్ట్ జాయింట్ సెంటర్ ప్రారంభం

– అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయం
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
– ప్రపంచంలోనే ఏకైక ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో ‘క్యువిస్’తో జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలు
– ట్రస్ట్ జాయింట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్. దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ స్థాయి సాంకేతిక సదుపాయాలతో, దేశ విదేశాల్లో సుశిక్షితులైన నిపుణుల ఆధ్వర్యంలో, కీళ్ల సంరక్షణకు ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దబడిన ట్రస్ట్ జాయింట్ సెంటర్ ఆదివారం ప్రారంభించబడింది. బెంజ్ సర్కిల్ సబ్ రిజిస్ట్రారు కార్యాలయం రోడ్డులో జరిగిన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించగా, మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ట్రస్ట్ జాయింట్ సెంటర్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న డాక్టర్ యు. వెంకటరమణ సారథ్యంలో ప్రపంచస్థాయి ఆసుపత్రి నెలకొల్పబడటం హర్షణీయమని మంత్రి కొనియాడారు. ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, ట్రస్ట్ జాయింట్ కేర్ చైర్మన్ డాక్టర్ యు. వెంకట రమణ మాట్లాడుతూ.. కీళ్ల సమగ్ర సంరక్షణ, దెబ్బతిన్న కీళ్ల పనితీరును పునరుద్ధరించే లక్ష్యంతో ట్రస్ట్ జాయింట్ సెంటర్ ఏర్పాటయిందని అన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్ల బృందం, అధునాతన జాయింట్ సేవింగ్ కార్టిలేజ్‌తో పునరుత్పత్తి చికిత్సలు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్, కీళ్ల సమస్యలు, క్రీడా గాయాలకు నిరంతర సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వెంకటరమణ వెల్లడించారు. అమెరికా, జర్మనీ దేశాల్లో శిక్షణ పొందిన ఆర్థోస్కోపీ, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ యు. భార్గవరామ్ మాట్లాడుతూ, నూతన హాస్పిటల్ నందు ప్రపంచంలోనే ఏకైక ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో ‘క్యువిస్’ అందుబాటులో ఉంటుందని, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని డాక్టర్ వెంకట రమణ వివరించారు. జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సల కోసం ప్రపంచంలోనే ఏకైక ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో అయిన ‘క్యువిస్’ను తమ హాస్పిటల్ నందు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ట్రస్ట్ జాయింట్ సెంటర్లోని ఆర్థో రోబోటిక్ విభాగం ద్వారా ఒక గంట కంటే తక్కువ సమయంలోనే కీళ్ల సమస్యలకు చికిత్సలను పూర్తిచేయవచ్చని తెలిపారు. క్యువిస్ రోబోతో కచ్చితమైన కోత, పరిపూర్ణ అమరిక, తక్కువ నొప్పి, సహజసిద్ధమైనదిగా ఉండే జాయింట్ రీప్లేస్మెంట్ సాధ్యమవుతుందని, రోబోటిక్ చికిత్సతో అతి తక్కువ సమయంలోనే పేషేంట్ కోలుకోగలుగుతారని వివరించారు. ట్రస్ట్ జాయింట్ సెంటర్ నందు అందుబాటులో ఉన్న అంతర్జాతీయ స్థాయి చికిత్సలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ భార్గవరామ్ కోరారు. కాంప్లెక్స్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సీహెచ్.ఎస్. నిశాంత్ మాట్లాడుతూ, ట్రస్ట్ జాయింట్ సెంటర్ ద్వారా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ కీళ్ల పునరుద్ధరణ, కీళ్ల పునర్నిర్మాణం తదితర ఆధునిక చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్, అనస్థీషియా నిపుణులు డాక్టర్ ఎన్. పావన ఫణి, వివిధ రంగాలకు చెందిన నగర ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *