Breaking News

ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో సతమతం

-మానసిక సమస్యలకు ఆధునిక చికిత్స ‘ ఇండ్లాస్ ‘
-ఆరోగ్యకరమైన సమాజం అవసరం
-ఇండ్లాస్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ఉన్నత విద్య మండలి చైర్మన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో సతమత మవుతున్నరని, అటువంటివారికి ఇండ్లాస్ చక్కని చికిత్సా కేంద్రంగా ఉపయోగ పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమ చంద్రారెడ్డి అన్నారు. సూర్యారావు పేటలోని దేవి ఆయిల్ మిల్ రోడ్ లో ఇండ్లాస్ చైల్డ్ అండ్ గైడెన్స్ క్లినిక్ ను హేమ చంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు విద్యార్థులు చదువుల కారణంగా కొంతమంది, సామాజికంగా అనేక కారణాల తో పిల్లలు కూడా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అంతకంటే ముఖ్యంగా తల్లి దండ్రులు బిజీ లైఫ్ కారణంగా పిల్లలను పట్టించుకోవడంలేదని అన్నారు. దీనితో పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలలో విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం పెంపొందించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్వర్యంలో పలు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన కోరినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా వున్నపుడే హెల్తీ సొసైటీ సాధ్యమవుతుంది అని అన్నారు. ప్రత్యేక అదితిగా పాల్గొన్న ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో మానసిక ఆందోళనలతో సతమత మవుతున్నారని అన్నారు.అయితే వారి సమస్యలకు ఎలా చికిత్స పొందాలో తెలియడం లేదన్నారు.అటువంటివారికి ఇండ్లాస్ క్లినిక్ చక్కని ట్రీట్మెంట్ అందిస్తుంది అన్నారు. చాలా మందికి తమకి సమస్య వుందని కూడా తెలియడం లేదన్నారు. ఇటీవల ఒక సర్వేలో పది మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్న వారు వున్నారని అన్నారు. ఇండ్లాస్ క్లినిక్ నందు అత్యాధునిక చికిత్స పద్దతులను అందిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబందించిన సమస్యలకు చక్కని వసతులతో, ఆహ్లాదకర వాతారణంలో చికిత్స అందించేందుకు సౌకర్యాలు కల్పించారని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ వై ఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంలో అనేక పరిస్థితుల కారణంగా పిల్లలలో మానసిక సమస్యలు వస్తున్నాయని అన్నారు. లేట్ మారేజ్, కోవిడ్, ఇతర కారణాలు వల్లచిన్న పిల్లలలో మానసిక సమస్యలతో పాటుగా అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇండ్లాస్ చైల్డ్ క్లినిక్ నందు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది అన్నారు. చిన్న పిల్లలకు సంబంధించి నూతన వైద్యం అందించేందుకు క్లినిక్ ప్రారంభించడం అభినందనీయం అని అన్నారు. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మానసిక సమస్యలకు అందరికీ అందుబాటులో వైద్యం అందించాలని సరికొత్త మార్పులతో చైల్డ్ క్లినిక్ ప్రారంభించినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సీనియర్ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ ఆర్.వేంకటేశ్వర రావు, మానసిక వైద్యుల డాక్టరు విశాల్ ఇండ్ల, ఇండ్లాస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ స్వప్న ఇండ్ల, పలువురు నగర వైద్యులు,ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *