Breaking News

విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డా. రవి శంఖర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు మూడు బృందములుగా ఏర్పడి వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజి అధికారులతో కలిసి సంయుక్తముగా కాకినాడ, తూర్పు గోదావరి మరియు డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో సంయుక్తముగా విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు నిర్వహిందనిజిల్లా ఇంచార్జ్ ఎస్.పి. కె.కుమార్ పేర్కొన్నారు.సోమవారండా బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలములోని అర్తమూరు గ్రామము లోని  కల్కి చెన్నకేశవ ఏజెన్సీస్ దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఫారం-O లేకపోవుట, స్టాక్ బోర్డు అప్డేట్ చేయకపోవుట మరియు గ్రౌండ్ స్టాక్ నకు మరియు స్టాక్ రిజిష్టర్ ప్రకారం సరిపోకపోవుట చేత సహాయ వ్యవసాయ సంచాలకులు, ఆలమూరు వారు సదరు షాపు పై 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సుమారు రూ 1,865/- లు విలువ గల 315 కిల్లోల యూరియాను సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ రమేష్, జియాలజిస్ట్ లక్ష్మినారాయణ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.కాకినాడ జిల్లా..కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలములోని వొమ్మంగి గ్రామములోని  ఉమారామలింగేశ్వర ఏజెన్సీస్ దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు సదరు షాపు నందు స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవుట, రైతులకు బిల్లులు ఇవ్వకపోవుట, షాపు నందు లైసెన్స్ ప్రదర్శించకపోవుట, స్టాక్ బోర్డు అప్డేట్ చేయకపోవుట చేత మండల వ్యవసాయ అధికారి, ప్రత్తిపాడు వారు సదరు షాపు పై 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సుమారు రూ 4,41,412/- లు విలువ గల 18.440 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసియున్నారు. మరియు క్రిబ్కో డి.ఏ.పి 50 కేజీలు వుండవలసిన బస్తాలో 49 కేజీలు మాత్రమే వుండుట చేత లీగల్ మెట్రాలజి అధికారులు సదరు షాపు పై LM Act 2009 ప్రకారం కేసు నమోదు చేసియున్నారాణి తెలిపారు.ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ విజయ కుమార్ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.తూర్పు గోదావరి జిల్లా..తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలములోని మాధవరాయుడుపాలెం గ్రామములోని  వెంకట మారుతి అగ్రో ఏజెన్సీస్ దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు సదరు షాపు నందు స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవుట, రైతులకు బిల్లులు ఇవ్వకపోవుట, షాపు నందు లైసెన్స్ ప్రదర్శించకపోవుట, స్టాక్ బోర్డు అప్డేట్ చేయకపోవుట చేత మండల వ్యవసాయ అధికారి, కడియం వారు సుమారు రూ 1,86,360/- విలువ గల 6.8 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.ఈ తనిఖిలలో వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *