Breaking News

ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర స్ఫూర్తి పొందేలా విధుల్లో పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పిలుపు నిచ్చారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మాధవీలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రజలకు, అధికారులకు, అనాధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. దేశ భక్తి చాటేలా ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్లు పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ అందచెయ్యగా, కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, డి ఆర్వో జి. నరసింహులు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *