Breaking News

అత్యంత ఘనంగా కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వ్యక్తులను తలచుకుని వారికి నివాళులు అర్పించడం ద్వారా దేశ భక్తిని చాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత పేర్కొన్నారు.మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండా ను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, జాతీయ నాయకుల స్ఫూర్తిని చిన్నపిల్లల్లో పెంపొందించే దిశలో వ్యాసరచన, వ్రకృత్వ పోటీల్లో చురుగ్గా పాల్గొనేలా పిల్లల్ని ప్రోత్సహించడం చాలా అవసరం అన్నారు. 77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వ్రకృత్వ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలల్లో పలువురు న్యాయ మూర్తులు , న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *